Junior NTR and Nara Lokesh : ఏపీ రాజకీయాల్లో ఒక సరికొత్త సీన్ ఒకటి కనిపించింది. మంత్రి నారా లోకేష్( Minister Nara Lokesh) జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీతో( Junior NTR flexi ) అభిమానులను ఉత్సాహపరిచారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని మంత్రి నారా లోకేష్ ప్రదర్శించిన వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గన్నవరం నియోజకవర్గంలో ఉన్న మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేలాండ్ బస్సుల తయారీ ప్లాంట్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆ మార్గంలో నూజివీడు మండలం సీతారాంపురం దగ్గర లోకేష్ కు టిడిపి శ్రేణులు స్వాగతం పలికాయి. ఆత్మీయ నేతకు స్వాగతం పలికే క్రమంలో టిడిపి శ్రేణులు అక్కడకు భారీగా చేరాయి.
Also Read : మరో పదేళ్లు.. చంద్రబాబు వయసు అయిపోయాకే రాజకీయాల్లోకి ఎన్టీఆర్?
* తారక్ అభిమానుల సందడి
మంత్రి లోకేష్ వచ్చిన సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సైతం అక్కడికి వచ్చారు. వారి చేతిలో తారక్ ఫ్లెక్సీలు కూడా ఉన్నాయి. అయితే టిడిపి కార్యకర్తలు, అభిమానుల కోరిక మేరకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని మంత్రి లోకేష్ పట్టుకుని కొద్దిసేపు అభిమానులను ఉత్సాహపరిచారు. దీంతో వారు కేరింతలు, ఈలలతో సందడి చేశారు. అయితే లోకేష్ చర్యలను చూసిన తారక్ ఫ్యాన్స్ తెగ ఖుషి అయ్యారు.
* ఎప్పటి నుంచో ఆ ఆరోపణ
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ను తొక్కేస్తున్నారన్న ఆరోపణ ఎప్పట్నుంచో ఉంది. అయితే అటు జూనియర్ ఎన్టీఆర్ సైతం తెలుగుదేశం పార్టీతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోలేదు. ప్రస్తుతం దృష్టి అంత సినిమాలపైనే పెట్టారు. ఈ క్రమంలో లోకేష్ ను ప్రమోట్ చేసేందుకే.. జూనియర్ ఎన్టీఆర్ ను పక్కన పెట్టారన్న ఆరోపణ ఉంది. అయితే దీనిని చాలాసార్లు ఖండించారు లోకేష్. అటువంటిదేమీ లేదని.. తమ మధ్య మంచి వాతావరణం ఉందని చెప్పుకొచ్చారు లోకేష్. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజుతోపాటు సినిమా వేడుకలకు సంబంధించి లోకేష్ శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతుంటారు. అదే సమయంలో తారక్ సైతం లోకేష్ విషయంలో స్పందిస్తుంటారు.
* యువనేతలో మార్పు
అయితే మంత్రి నారా లోకేష్ లో( Nara Lokesh) స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. సమకాలీన అంశాలపై ఆయన వెనువెంటనే స్పందిస్తున్న తీరు అభినందనలు అందుకుంటుంది. అభిమానుల కోరిక మేరకు తారక్ ఫ్లెక్సీ ని ప్రదర్శించి వారి అభిమానాన్ని చురగొన్నారు లోకేష్. పైగా జూనియర్ ఎన్టీఆర్ తో తనకు ఎటువంటి విభేదాలు లేవని సంకేతాలు ఇచ్చారు. లోకేష్ ను చూస్తుంటే ఎక్కడ తగ్గాలో తెలుసు.. ఎక్కడ నెగ్గాలో తెలుసు అంటూ టిడిపి శ్రేణులు వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.
Also Read : లోకేష్ మాటిస్తే అంతే.. గంటల్లో పని జరగాల్సిందే!