Prabhas
Prabhas : చాలామంది హీరోలు డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలను చేస్తూ మంచి విజయాలను అందుకుంటు ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు… ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు రిలీజ్ చేయడానికి ప్రతి ఒక్కరూ సన్నాహాలు చేసుకుంటున్న నేపధ్యంలో ప్రేక్షకులను మాస్ సినిమాలు మాత్రమే ఎక్కువగా అలరిస్తూ భారీ సక్సెస్ లను సాధిస్తూ ఉండటం విశేషం…ఇక ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు నార్త్ లో పండగ చేసుకునే అభిమానులు ఉన్నారనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న ప్రభాస్ తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తున్నాడు. ఈ సినిమాలతో పాటుగా మరికొన్ని సినిమాలను కూడా లైన్ లో పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు అయిన సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali) ప్రభాస్ (Prabhas) తో ఒక సినిమా చేయాలనే ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. కానీ ఆయనకు మాత్రం ప్రభాస్ డేట్స్ దొరకడం లేదు. ప్రస్తుతం ఉన్న బీజీలో రెండు సంవత్సరాల వరకు ప్రభాస్ డేట్స్ అయితే ఖాళీగా లేవు. ఆ సమయం వరకు వేచి చూసే అవకాశం ఉంటే ఉండాలి, లేదంటే అదే సబ్జెక్ట్ ని వేరే హీరోతో చేసే అవకాశం ఏదైనా ఉంటే వాళ్లతో చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో మాత్రం ప్రభాస్ డేట్స్ అయితే దొరకడం చాలా కష్టమనే తెలుస్తోంది.
మరి ఇలాంటి సందర్భంలో సంజయ్ లీలా భన్సాలీ తన సినిమాని వేరే హీరోలతో చేస్తాడా లేదంటే ప్రభాస్ కోసం ఎదురు చూస్తాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఆదిపురుష్ (Aadi Purush) సినిమా తర్వాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకులతో సినిమాలను చేయాలనే ఆలోచనలో కూడా లేడట…
ఎందుకంటే ఆది పురుష్ సినిమా డిజాస్టర్ బాట పట్టింది. దర్శకుడు ఓం రావత్ (Om Raout) ఈ సినిమాని భారీగా తెరకెక్కిస్తాడు అనుకుంటే చాలా పేలవమైన సినిమాగా తీర్చిదిద్దాడు. అందువల్లే మరోసారి బాలీవుడ్ దర్శకులకు అవకాశం ఇచ్చేది లేదు అంటూ ప్రభాస్ ఒక డిసిజన్ అయితే తీసుకున్నారట. మరి ఇలాంటి సందర్భంలో ప్రభాస్ ఎలాంటి సినిమాలను చేస్తాడు తద్వారా ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది…
ఇక రాబోయే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా నేపధ్యం లో వస్తున్న సినిమాలే కావడంతో ఈ సినిమాల మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక వాటికి తగ్గట్టుగా సినిమాలను రూపొందించి భారీ విజయాలను అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…