Mazaka Movie Collection: Mazaka Movie Collection: ప్రముఖ యంగ్ హీరో సందీప్ కిషన్(Sundeep Kishan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మజాకా'(Mazaka Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై యావరేజ్ టాక్ ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ‘ధమాకా’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందించిన తర్వాత త్రినాథరావు నక్కిన నుండి వచ్చిన చిత్రమిది. ప్రొమోషన్స్ కూడా చాలా ఆకట్టుకునే విధంగా ప్లాన్ చేసారు. కానీ విడుదల తర్వాత సినిమాలో అంత దమ్ము లేదనే టాక్ వచ్చేసింది. ఈ చిత్రం లో హీరోయిన్ గా రీతూ చౌదరి(Ritu Chowdary) నటించగా, రావు రమేష్(Rao Ramesh), అన్షు(Anshu), హైపర్ ఆది(Hyper Aadhi) వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. వీళ్లంతా విడుదలకు ముందు ప్రొమోషన్స్ లో చేసిన హంగామా మామూలుది కాదు. ఇప్పటికీ వాటిని మరచిపోలేము. అయితే ఈ సినిమా విడుదలై ఎట్టకేలకు మూడు రోజులు పూర్తి చేసుకుంది. ఈ మూడు రోజుల్లో ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది, ఇంకా ఎంత వసూళ్లను రాబడితే బ్రేక్ ఈవెన్ ని అందుకుంటుంది అనేది చూద్దాం.
Also Read: సినిమాలు మానేసిన ఈ భామ ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి మూడవ రోజు 64 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయట. మొత్తం మీద మూడు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి 2 కోట్ల 47 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 4 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. వీటిలో నైజాం ప్రాంతం నుండి 96 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 38 లక్షలు, ఆంధ్రా ప్రాంతం నుండి కోటి 13 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ వంటి ప్రాంతాలకు కలిపి 58 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ చిత్రానికి 3 కోట్ల 5 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ 11 కోట్ల రూపాయిలు. అంటే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ హిట్ స్టేటస్ కి చేరుకోవాలంటే మరో 8 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు రావాలి. నేడు, రేపు వీకెండ్ కాబట్టి తెలుగు రాష్ట్రాల నుండి రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావొచ్చు. అదే విధంగా వరల్డ్ వైడ్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 6 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు రావొచ్చు. ఫుల్ రన్ లో కాస్త యావరేజ్ రేంజ్ హోల్డ్ ని దక్కించుకున్న 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లతో క్లోజ్ అవ్వొచ్చు. మొత్తం మీద బయ్యర్స్ కి మూడు కోట్లు నష్టం మిగిలేలా ఉంది. ఈ సినిమాతో కుంభస్థలం బద్దలు కొడుతాను అని బలమైన నమ్మకంతో ఉన్న సందీప్ కిషన్ కి చివరకు నిరాశే మిగిలింది.