Prabhas : ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటు ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. బాలీవుడ్ హీరోలకు సైతం పోటీని ఇస్తూ వాళ్ళను పూర్తిగా డామినేట్ చేస్తూ మన సినిమాల హవాని ఎక్కువగా కొనసాగించే విధంగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. ఇక మీదట కూడా ఇలాంటి గొప్ప సినిమాలను చేస్తూ భారీ కలెక్షన్స్ ని కొల్లగొడితే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ గా మారుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
Also Read : ప్రభాస్ వల్ల పెద్ద హీరోలతో సినిమాలు చేసే ఆలోచనను మానేసిన మారుతి…
యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్(Prabha)… బాహుబలి(Bahubali) సినిమాతో పాన్ ఇండియా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి బాలీవుడ్ ప్రేక్షకులను సైతం తన అభిమానులుగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. చాలా ఎక్కువ సినిమాలకు కమిట్ అవుతూ తొందరగా షూటింగ్స్ చేస్తుంటే ప్రభాస్ సంవత్సరానికి రెండు సినిమాలు చేస్తాడు అనే నమ్మకంతో తమ అభిమానులు ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రభాస్ హెల్త్ కొంతవరకు చెడిపోవడం వల్ల ఆయన షూటింగ్ లకు పెద్దగా హాజరు కావడం లేదట. ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని బ్రేక్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక దీంతోపాటు మారుతి డైరెక్షన్ లో రాజాసాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మరి తొందర్లోనే ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా మారుతి లాంటి డైరెక్టర్ ప్రభాస్ లాంటి స్టార్ హీరో తో సినిమా చేయడం వల్ల ఆయన ఇమేజ్ అనేది చాలా వరకు పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే హీరోలతో సినిమాలను చేసే మారుతి మొదటిసారి పాన్ ఇండియా హీరోను డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. అయితే ఈ సినిమాతో భారీ విజయాన్ని దక్కించుకుంటానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఇక ఫౌజీ సినిమా తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత సాలార్ 2, కల్కి 2 సినిమాలు చేయాల్సి ఉన్నాయి. మరి ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ లైనప్ లోకి మరొక దర్శకుడు వచ్చి చేరినట్లుగా తెలుస్తోంది. ఆయన ఎవరు అంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ‘జైలర్’ (Jailer) సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్న నెల్సన్ సైతం ప్రభాస్ (Prabhas) తో సినిమా చేయడానికి ఉవ్విళ్లూరుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తను రజనీకాంత్(Rajinikanth) తో జైలర్ 2 అనే సినిమా చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా ఎన్టీఆర్ కి ఒక స్టోరీని, ప్రభాస్ కి ఒక స్టోరీని వినిపించినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్ళిద్దరిలో ఆయన ఎవరితో ముందుగా సినిమాని చేస్తాడు. ఆ సినిమాతో ఆయన ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.
Also Read : సందీప్ రెడ్డి వంగ ను చూసి భయపడుతున్న ప్రభాస్…కారణం ఏంటంటే..?