Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క నటుడు వరుస సక్సెస్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ గా ఒక గొప్ప గుర్తింపైతే సంపాదించుకుంది. కాబట్టి ఇక మీదట వచ్చే సినిమాలతో వరుస సక్సెస్ లను సాధించి మన ఇండస్ట్రీ స్థాయి ఏంటో చూపించాల్సిన అవసరం కూడా ఉంది… ఒకవేళ మన సినిమాలు కనక భారీ సక్సెస్ ను సాధిస్తే సినిమా స్థాయి పెరగడమే కాకుండా మన వాళ్ళ స్టామినా ఏంటో మరోసారి సౌత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరికి తెలుస్తుంది…
ఒక సినిమాను డైరెక్ట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. ఒక మంచి కథతో స్టార్ హీరో ని ఒప్పించి అతని డేట్స్ తీసుకోవడానికి కొద్ది రోజులపాటు వేచి చూడాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ చిన్న సినిమాలను చేస్తూ భారీ విజయాలను సాధిస్తున్న దర్శకులు మాత్రం అలా వెయిటింగ్ చేయడానికి పెద్దగా ఇష్టపడరు. అయినప్పటికి స్టార్ హీరో దొరికితే మాత్రం ఒక సినిమా తనతో చేస్తే వాళ్ళ మార్కెట్ కూడా భారీ గా పెరుగుతుందనే ఉద్దేశ్యంతో వాళ్లకోసం కొద్ది రోజులపాటు వెయిట్ చేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. కానీ అది సంవత్సరాలుగా లేట్ అవుతుంటే చాలా తీవ్రమైన ఇబ్బందులకు గురవుతారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక చిన్న సినిమాలకు గుర్తింపు తీసుకొచ్చిన దర్శకులలో మారుతి ఒకరు. ఈయన సంవత్సరానికి రెండు మూడు సినిమాలను చేస్తూ మీడియం రేంజ్ హీరోలకు మంచి సక్సెస్ లను అందిస్తూ ముందుకు సాగుతుండేవాడు. ప్రభాస్(Prabhas) తో రాజసాబ్(Rajasaab) అనే సినిమాని స్టార్ట్ చేశాడు. దాదాపు ఈ సినిమాని స్టార్ట్ చేసి నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు కూడా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ ఏంటి అనే విషయం మీద సరైన స్పష్టత అయితే రావడం లేదు.
Also Read : సందీప్ రెడ్డి వంగ ను చూసి భయపడుతున్న ప్రభాస్…కారణం ఏంటంటే..?
ఈ లెక్కన ఆయన ఒక్క సినిమా మీద మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయాన్ని కేటాయించడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటివరకు ఆయన దాదాపు ఒక పది సినిమాలు చేసేవాడు.
తద్వారా ఆయన మార్కెట్ అనేది భారీగా పెరిగిన పెరుగకపోయినా కూడా ఆయన సినిమాలు జనాల్లో ఎక్కువగా ఆదరణ సంపాదించుకునేవి. తద్వారా ఇండస్ట్రీలో రెవెన్యూ కూడా ఎక్కువగా జనరేట్ అయ్యేది. చాలామంది టెక్నీషియన్స్ కి పని దొరికేది. ఇక రాజాసాబ్ సినిమాతో మారుతికి ఒక స్టార్ డమ్ అయితే వచ్చింది.
ఇక స్టార్ హీరోని నమ్ముకుని సినిమాలు చేసే కంటే మీడియం రేంజ్ హీరోలతో వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగడం మంచిదని ఆయన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇకమీదట ఆయన స్టార్ హీరోల జోలికి వెళ్ళకూడదని అనుకుంటున్నారట. రాజాసాబ్ సినిమా రిలీజ్ అయితే వెంటనే ఒక రెండు చిన్న సినిమాలు స్టార్ట్ చేసి వాటిని సూపర్ సక్సెస్ లుగా మలచాలనే ఉద్దేశ్యంలో తను ఉన్నట్టుగా తెలూస్తోంది…
Also Read : ప్రభాస్ ఆఫీస్ PRO పై పోలీస్ కేసు నమోదు..కారణం ఏమిటంటే!