SRH Vs KKR: అతిలోక సుందరి శ్రీదేవి స్వర్గానికి వెళ్తూ వెళ్తూ ఈ అందగత్తెను తన రూపంతో భూమ్మీద వదిలి వెళ్ళింది అనుకుంటా.. నల్లని కురులు.. నెమలి కన్నుల లాంటి నేత్రాలు.. అమాయకపు చూపులతో ఆమె కనిపించిన ప్రతిసారి కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ మొత్తం ఊగిపోయింది. కెమెరామెన్ ఆమెను ప్రతిసారి చూపించడంతో.. ప్రేక్షకులు మొత్తం అరవడం మొదలుపెట్టారు. అంతేకాదు “కెమెరామెన్ బావ మీ చెల్లి సూపర్.. ఏంజెల్ అంటే నమ్ము”అంటూ బెంగాలీలో మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే… ఆ అమ్మాయి ఎవరో తెలియదు.. అందరి ప్రేక్షకుల్లాగానే మ్యాచ్ చూసేందుకు ఈడెన్ గార్డెన్స్ వచ్చింది. ఆమె వెంట స్నేహితులు ఉన్నట్టు కనిపిస్తోంది. చూసేందుకు ఆ యువతి శ్రీమంతుల కుటుంబంలో పుట్టినట్టు తెలుస్తోంది. కాకపోతే ఆమె పెద్దగా దేనికి రియాక్ట్ కావడం లేదు. వికెట్లు పడినప్పటికీ.. ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ పెద్దగా హావభావాలు ప్రదర్శించడం లేదు. చూస్తుంటే మృదు స్వభావిలాగా ఉంది. ఆమె కోల్ కతా జెర్సీ ధరించి వచ్చింది కాబట్టి.. నైట్ రైడర్స్ అభిమాని అని తెలుస్తోంది.. స్నేహితులతో సరదాగా ముచ్చటిస్తోంది.. అరుదుగా మాత్రమే నవ్వుతోంది. చూడబోతే క్రికెట్ ను అమితంగా ఇష్టపడే యువతి లాగా ఆమె దర్శనమిస్తోంది. అందువల్లే ఈడెన్ గార్డెన్స్ లో ఆమె గురించే తెగ చర్చ నడుస్తోంది.
Also Read: వరుసగా మూడో ఓటమి.. SRH ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకుంటే మంచిది
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే..
ఈడెన్ గార్డెన్స్ వేదికగా గురువారం కోల్ కతా నైట్ రైడర్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH vs KKR) తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రేక్షకులు అంతంత మాత్రమే వచ్చారు. టికెట్ రేట్లు భారీగా ఉండడంతో సగం మైదానం ఖాళీగానే కనిపించింది. ఇక వచ్చిన వారిలో చాలామంది యువతే ఉన్నారు. అందులో ఓ యువతి మాత్రం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. శ్రీదేవికి కజిన్ లాగా.. పోత పూసిన నిలువెత్తు అందం లాగా కనిపించింది. దీంతో కెమెరామెన్ ఆమెను పదేపదే చూపించడం మొదలుపెట్టాడు. దీంతో ఒక్కసారిగా ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ పర్సనాలిటీ అయింది.. ఆమె ఎవరో తెలియదు.. నేపథ్యం గురించి అసలు తెలియదు. కానీ కుర్ర కారు మాత్రం ఆమెను చూస్తూ ఉండిపోయారు. కొందరైతే సామాజిక మాధ్యమాలలో ఆమె ఫోటోలు పోస్ట్ చేసి.. ఈమె తెగ డిస్టర్బ్ చేస్తోందని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. కొందరైతే సినిమా తార అవుతుందని.. సినిమా రంగాన్ని ఏలుతుందని.. ఇటీవల మోనాలిసా ఎలా అయితే ట్రెండింగ్ పర్సనాలిటీ అయిందో.. ఈమె కూడా అదే స్థాయిలో పేరు తెచ్చుకుంటుందని వ్యాఖ్యానించడం మొదలుపెట్టారు. మొత్తానికి హైదరాబాద్ జట్టు ఓటమి బాటలో ఉన్నప్పటికీ.. కాస్తలో కాస్త ఈ అమ్మాయి హైదరాబాద్ అభిమానులకు రిలీఫ్ ఇచ్చింది. ఎందుకంటే ఆమె అందం అలా ఉంది మరి.
Who is she , anyone know ?? #srhvskkr #kkrvsSrh pic.twitter.com/s0nj6a5LtF
— Cricket Legends (@CricketLegende) April 3, 2025