Poonam Kaur
Poonam Kaur: సినిమా ఇండస్ట్రీ అంటేనే రోజు ఏదో ఒక న్యూస్ లో హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు అందరూ ఉంటారు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇక ముఖ్యంగా వాళ్ల జీవితంలో ఏం జరిగినా కూడా వాళ్లు వార్తల్లో నిలుస్తూ ఉంటారు.ఇక ఒకప్పుడు హీరో లు ఏం చేస్తున్నారు, హీరోయిన్స్ ఏం చేస్తున్నారు లాంటి విషయాలు ఎవరికీ తెలిసేవి కాదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియా ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఒకప్పుడు సెలబ్రిటీలకు ఉన్నంత ప్రైవసీ లైఫ్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి లేకుండా పోతుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా అభిమానులకు తెలిసిపోతుంది.
హీరో ఎలాంటి సినిమాలు చేస్తున్నారు. ఏ హీరోయిన్ ఎవరితో రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తుంది. లాంటి ప్రతి విషయాన్ని కూడా సాధారణ అభిమాని తెలుసుకో గలుగుతున్నాడు. ఇక ఇదే క్రమంలో ఒకప్పుడు తెలుగులో హీరోయిన్ గా నటించి ఆ తర్వాత సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా నటించి తనదైన రీతిలో మంచి గుర్తింపును తెచ్చుకున్న నటి పూనమ్ కౌర్ ప్రస్తుతం ఒక దర్శకుడితో ఫోన్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు తనని ఒక హీరో మోసం చేశారంటూ తను సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది.
అలాగే ఆమె మాట్లాడిన ఫోన్ కాల్స్ కూడా లీకై యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. ఇక ఇలాంటి క్రమంలో ఈ వ్యవహారాన్ని మళ్ళీ తెరపైకి తీసుకు వచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది… అందుకే ఆమె మాట్లాడిన ఫోన్ కాల్ మరొకటి ఇప్పుడు లీక్ అయి సోషల్ మీడియాలో భారీ ఎత్తున వైరల్ అవుతుంది.అయితే వీటిని ఎవరు లీక్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే తను ఒక స్టార్ హీరో కోసం,ఆయన వాళ్ల ఫ్యామిలీ బాగుండాలని చాలా రకాల పూజలు చేస్తూ వచ్చాను, కానీ తీరా సమయానికి ఆ హీరో నన్ను మోసం చేశాడు అంటూ తను చాలా రకాల ఆరోపణలను చేసింది.
ఇక ఇప్పుడు మరో కాల్ రికార్డ్ కూడా లీక్ అయింది.ఇక ఈ విషయం మీద మరోసారి చర్చ జరుగుతుంది. అయితే ప్రతిసారి ఈ విషయాన్ని ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు అన్నది మాత్రం సామాన్య మానవుడికి అర్థం కావడం లేదు పూనమ్ చాలా సంవత్సరాల నుంచి తన బాధను వెళ్లబుచ్చుతు వస్తుంది అయినప్పటికీ అప్పటికప్పుడు ఆ గొడవ సద్దుమను గుతుంది. మళ్లీ కొద్ది రోజుల తర్వాత తెరపైకి వస్తుంది.అయితే దీనికి శాశ్వత పరిష్కారం ఏంటి అనే దాని పైన ఎవ్వరికీ కూడా అసలైన క్లారిటీ రావడం లేదు…