Dhootha Trailer: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్న ఈ తరం హీరోలలో నాగచైతన్య ఒకరు. తనదైన రీతిలో కథలను ఎంచుకుంటూ ఒక మూస ధోరణిలో కాకుండా ప్రయోగాలు చేస్తూ ముందుకు కదులుతున్న యంగ్ హీరోల్లో నాగచైతన్య అందరికంటే ముందు వరుసలో ఉంటాడు. ఎందుకంటే తను ఒక జానర్ కి మాత్రమే పరిమితం కాకుండా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలు చేస్తూ వరుసగా మంచి విజయాలను కూడా అందుకుంటున్నాడు.
ఇక ఇప్పుడు సినిమాలనే కాకుండా ఆయన వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంటున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లోనే దూత అనే ఒక వెబ్ సిరీస్ ని చేస్తున్నారు. దానికి సంబంధించిన ట్రైలర్ ని ఇవాళ్ల రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ని చూస్తుంటే అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగే సిరీస్ గా ఇది తెరకెక్కినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే ట్రైలర్ లో స్టార్టింగ్ లోనే మనల్ని పాలించే నాయకుడు అన్యాయం చేస్తే వాళ్లను ప్రశ్నించడానికి ఒక జర్నలిస్ట్ అనేవాడు ఉండాలి అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ ని స్టార్ట్ చేసి మొదట్లోనే సొసైటీకి అన్యాయం చేస్తున్న నాయకులను ఒక జర్నలిస్ట్ ప్రశ్నించబోతున్నాడు అనే విధంగా ఆ ట్రైలర్లో ముందుగానే మనకు చెప్పేశారు.
ఇక దాంతో ఈ సీరీస్ లో నాగ చైతన్య జర్నలిస్ట్ సాగర్ గా మనకు కనిపించబోతున్నట్టు గా మనకు తెలుస్తుంది.ఇక నాగ చైతన్య కూడా జర్నలిస్ట్ గా ఒక కొత్త అవతారం ఎత్తి ఈ సీరీస్ లో కొన్ని సంవత్సరాలు గా పరిష్కరించ లేకపోతున్న కొన్ని ప్రాబ్లమ్స్ కి సోలుషన్ వేతికే పనిలో ఉన్నట్టు గా తెలుస్తుంది. అయితే ఈ ట్రైలర్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తే తనతో పాటు సనిహిత్యంగా ఉండే వాళ్ళతోనే జర్నలిస్ట్ సాగర్ (నాగ చైతన్య) పోరాటం చేయబోతున్నట్టు గా కూడా తెలుస్తుంది… అయితే విక్రమ్ కే కుమార్ డైరెక్షన్ లో ఇప్పటికే నాగచైతన్య మనం, థాంక్యూ లాంటి సినిమాలను చేశాడు అందులో మనం సినిమా సూపర్ హిట్ అవ్వగా, థాంక్యూ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. ఇక ఈ ట్రైలర్ ని చూస్తుంటే నాగ చైతన్య తన పూర్తి ఎఫర్ట్స్ ఈ సిరీస్ మీద పెట్టినట్టు గా తెలుస్తుంది. అందుకే ఈ సీరీస్ మంచి విజయాన్ని సాధిస్తుందని అనిపిస్తుంది.
ఇక ఇప్పటి వరకు నాగ చైతన్య జర్నలిస్ట్ గా ఏ సినిమాలను కనిపించలేదు. కాబట్టి నాగ చైతన్య ఈ పాత్ర చేయడం ఈ సిరీస్ కి చాలా వరకు ప్రెష్ ఫీల్ తీసుకువస్తుంది అలాగే ఆయన నటన ఈ సీరీస్ కి చాలా వరకు ప్లస్ అవుతుందని తెలుస్తుంది.ఇక ఈ ట్రైలర్ లో చూపించినట్టుగా ప్రతి సీను కూడా ఒక ఇంట్రెస్టింగ్ ని క్రియేట్ చేస్తూ ఉండేలా మనకు కనిపిస్తుంది. అలా కనక ఈ సిరీస్ అధ్యాంతం ఉండగలిగితే అటు విక్రమ్ కే కుమార్ కి, ఇటు నాగచైతన్య కెరియర్ లకి ఇది చాలావరకు ప్లస్ అవుతుంది అనే చెప్పాలి. ఇక డిసెంబర్ 1 వ తేదీన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది…