Pooja Hegde : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు పూజా హెగ్డే(Pooja Hegde). హిట్/ ఫ్లాప్ తో సంబంధం లేకుండా ఈమెకి ఆడియన్స్ లో చెక్కు చెదరని క్రేజ్ ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పుట్టి పెరిగింది మొత్తం నార్త్ ఇండియా లో అయినప్పటికీ, ఆమెకు మొట్టమొదటి అవకాశం ఇచ్చింది మన టాలీవుడ్ మాత్రమే. అక్కినేని నాగ చైతన్య హీరో గా నటించిన ‘ఒక లైలా కోసం’ అనే చిత్రం ద్వారా ఈమె వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘ముకుంద’ చిత్రం తో ఫ్లాప్ అందుకున్న ఈమె, బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ కూడా ఫ్లాప్ అందుకొని, మళ్ళీ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ లను చూసింది. అలా అల్లు అర్జున్ , రామ్ చరణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ వంటి హీరోలతో వరుస సినిమాలను చేసి బ్లాక్ బస్టర్స్ ని అందుకుంది.
Also Read : అవకాశాలు లేక చివరికి అలాంటి పనులకు సిద్దమైన పూజా హెగ్డే.. ఒక్క నిర్ణయం జీవితాన్నే మార్చేసింది!
ఆ తర్వాత తమిళం లో కూడా ఈమె ఎన్నో క్రేజీ సినిమాల్లో నటించి అక్కడి ఆడియన్స్ కి కూడా దగ్గరైంది. తలపతి విజయ్ తో ‘బీస్ట్’ చిత్రం ద్వారా తమిళ ఆడియన్స్ కి పరిచయమైన పూజా హెగ్డే, ఇప్పుడు మరో విజయ్(Thalapathy Vijay) తో కలిసి ‘జన నాయగన్'(Jana Nayagan Movie) అనే చిత్రం చేస్తుంది. ఈ సినిమాతో పాటు సూర్య ‘రెట్రో’ లో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈమధ్య కాలం లో ఈమె చేస్తున్న ప్రతీ సినిమా కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్స్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈమె షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ తో తప్ప దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి సినిమాలు చేసింది. కానీ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు అంటే ఎంత దురదృష్టమో అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ ఈమెకు అవకాశాలు వస్తూనే ఉన్నాయి.
రీసెంట్ గా ఆమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ ‘అవకాశాలు అనేది ఏ ఇండస్ట్రీ లో అయినా రావొచ్చు. నాకు ఎక్కడ ఛాన్స్ వచ్చినా చేసుకుంటూ పోతాను, కచ్చితంగా ఈ బాషలోనే చేయాలి అనే లిమిట్స్ నేను పెట్టుకోలేదు. ఒకసారి పనిచేసిన నిర్మాత, నాకు మరో సినిమాలో అవకాశం ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదు. చేతికి వచ్చింది చేసుకుంటూ పోయాను. మధ్యలో ఫ్లాప్స్ వచ్చినప్పుడు అవకాశాలు తగ్గిపోతుంటాయి, నా విషయం లో కూడా అలాంటి ఫేస్ నడిచింది. కానీ నేను వాటిని ధైర్యం గా ఎదురుకున్నాను. నా లక్ష్యం మంచి పాత్రలు చేయడమే. ఎలాంటి రోల్ వచ్చిన చేస్తాను. వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటాను’ అంటూ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read : మూగ, చెవిటి పాత్రలో పూజ హెగ్డే, ఫ్యాన్స్ జీర్ణించుకోగలరా… బ్లాక్ బస్టర్ సిరీస్ కోసం ఊహించని సాహసం