Pooja Hegde : సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం, ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు. రాత్రికి రాత్రి ఒకరిని స్టార్ ని చేసేస్తుంది, మరొకరిని పాతాళంలోకి తొక్కేస్తుంది. ఎన్నో ఉదాహరణలు చూసాము. 2020 వ సంవత్సరం మొదలయ్యాక మన టాలీవుడ్ లో అనూహ్య మార్పులు వచ్చాయి. మన స్టార్ హీరోలు పాన్ ఇండియన్ స్టార్స్ అయిపోయారు. సీనియర్ హీరోలు దుమ్ము లేపేస్తున్నారు. చిన్న హీరోలు సైతం వందల కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొడుతున్నారు. ఇక హీరోయిన్స్ విషయం లో అయితే కనీవినీ ఎరుగని మార్పులు చోటు చేసుకున్నాయి. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్త హీరోయిన్స్ కేవలం రెండు మూడు సినిమాలతోనే పాపులర్ అవ్వడం, ఆ తర్వాత వాళ్ళు వరుస ఫ్లాప్స్ ని ఎదురుకొని కనుమరుగు అవ్వడం వంటివి చూస్తూనే ఉన్నాం. కానీ ఒక హీరోయిన్ దాదాపుగా సూపర్ స్టార్ స్టేటస్ కి చేరుకొని, బాలీవుడ్ మోజులో పడి కెరీర్ ని సర్వనాశనం చేసుకుంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు, పూజ హెగ్డే(pooja hegde). కొత్త హీరోయిన్స్ ఏడాదికి ఎంతోమంది పుట్టుకొస్తున్నప్పటికీ ఈమె డిమాండ్ ఈమెదే. తెలుగు, తమిళ భాషల్లో సూపర్ స్టార్స్ సరసన హీరోయిన్ గా నటిస్తూ మంచి క్రేజ్ ని తెచ్చుకున్న ఈమె, బాలీవుడ్ లోకి అడుగుపెట్టి వరుస ఫ్లాప్స్ ని కొని తెచ్చుకుంది. ఆమె టాలీవుడ్ లో వదిలి వెళ్లిన ఈ గ్యాప్ ని శ్రీలీల, మీనాక్షి చౌదరి, భాగ్యశ్రీ వంటి వారు ఫిల్ చేసారు. వరుస ఫ్లాప్స్ కారణంగా పూజ హెగ్డే కి హిందీ లో అవకాశాలు తగ్గిపోయాయి. టాలీవుడ్ వైపు చూస్తే ఇప్పుడు ఆమెకు అవకాశాలు ఇచ్చేవాళ్ళు లేరు. మీడియం రేంజ్ హీరోల నుండి, స్టార్ హీరోల వరకు శ్రీలీల, మీనాక్షి చౌదరి జపం చేస్తున్నారు. అందుకే పూజ హెగ్డే సమంత, తమన్నా వెళ్లిన దారిలోనే నడవాలని అనుకుంటుంది.
ప్రస్తుతం ఈమె చేతిలో సూర్య(Suriya Sivakumar) రెట్రో(Retro movie), విజయ్(Thalapathy Vijay) ‘జన నాయగన్'(jana nayagan) వంటి సినిమాలు ఉన్నాయి. ఈ చిత్రంతో పాటు హిందీ లో రెండు సినిమాలు ఉన్నాయి. ఇవి అయిపోయాక ఆమె నెట్ ఫ్లిక్స్ లో ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అజయ్ జ్ఞానముత్తు ఇటీవలే పూజ హెగ్డే ని కలిసి స్టోరీ వినిపించగా, ఆమె చాలా నచ్చిందని, త్వరలోనే షూటింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటానని చెప్పిందట. వెండితెర పై మహారాణి లాగ ఉండాల్సిన పూజ హెగ్డే, ఇప్పుడు వరుస ఫ్లాప్స్ కారణంగా ఓటీటీ కి షిఫ్ట్ ఐపోయిందంటూ సోషల్ మీడియా లో ఆమె అభిమానులు బాధ పడుతున్నారు. కానీ పూజ హెగ్డే అందం ఏమాత్రం తరగిపోలేదు. రాబోయే రోజుల్లో ఆమెకి మళ్ళీ మంచి అవకాశాలు రావొచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈమె కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది.