Bunny Vasu : అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన చిత్రం ‘తండేల్'(Thandel Movie). వరుస ఫ్లాప్ తర్వాత అక్కినేని ఫ్యామిలీ పరువుని నిలబెట్టిన సినిమా ఇది. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో రావడం వల్ల ఈ సినిమా పూర్తి స్థాయి పొటెన్షియల్ బయట పడలేదని, సమ్మర్, లేదా సంక్రాంతికి విడుదల చేసి ఉండుంటే కచ్చితంగా వంద కోట్ల రూపాయిల షేర్ మార్కుని కూడా అందుకొని ఉండేదని అంటున్నారు విశ్లేషకులు. మొదటి రోజు ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ అనుకున్న రేంజ్ లో రాలేదు కానీ, యావరేజ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం సూపర్ హిట్ కి ఏ మాత్రం తీసిపోని విధంగానే వచ్చాయి. కారణం నాగ చైతన్య నటన, దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad) అందించిన అద్భుతమైన సంగీతం అని అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. చిరాకాలం గుర్తించుకోదగ్గ పాటలను ఆయన అందించాడు.
చెవుల్లో అమృతం పోసినట్టు అనిపించే సంగీతమే ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడానికి ప్రధాన కారణమైంది. అయితే ఈ సినిమాకి ఎదురైనా అతి పెద్ద సవాల్ పైరసీ. అదేంటీ ప్రతీ సినిమాకి జరుగుతున్నదే కదా, ఈ చిత్రం గురించి స్పెషల్ గా మాట్లాడుతున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ విడుదల రోజే ఓటీటీ లో విడుదలయ్యే సినిమా ఎంత క్వాలిటీ ఉంటుందో, ఆ రేంజ్ క్వాలిటీ ఆడియో, వీడియో మిక్సింగ్ తో ఈ సినిమా ప్రింట్ బయటకి వచ్చేసింది. దీంతో అత్యధిక శాతం మంది జనాలు థియేటర్స్ లో కంటే ఎక్కువగా, పైరసీ లోనే చూసారు. ఫలితంగా చాలా నష్టం ఏర్పడింది. రీసెంట్ గానే నిర్మాత బన్నీ వాసు(Bunny Vasu), చావా తెలుగు వెర్షన్ ని విడుదల చేస్తున్న సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘తండేల్ మూవీ పైరసీ జరిగినప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టడం అతి పెద్ద పొరపాటు. అప్పటి వరకు ఈ చిత్రం పైరసీ కి గురైంది అనే విషయం చాలా మంది జనాలకు తెలియదు. మేము ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ఆ విషయం అందరికీ తెలిసిందే. దీంతో పైరసీ వెర్షన్ ని డౌన్లోడ్ చేసుకొని మరీ చూసారు. నా జీవితం లో ఏదైనా పెద్ద పొరపాటు చేసానంటే, ఆరోజు ఏర్పాటు చేసిన ప్రెస్ మీటే’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. భవిష్యత్తలో మళ్ళీ అలాంటి పొరపాటు చేయబోనని చెప్పుకొచ్చాడు. పైరసీ చేసిన వారిని పట్టుకొని తగిన చర్యలు తీసుకుంటామని చెప్పాడు కానీ, ఇప్పటి వరకు ఎలాంటి ఫలితం కనపడలేదు.
Also Read : రజినీకాంత్ ‘కూలీ’ టీజర్ విడుదల తేదీ ఖరారు..టీజర్ లోని డైలాగ్స్, మెయిన్ హైలైట్స్ ఇవే!