https://oktelugu.com/

Johnny Master Arrested : గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్.. ఆ స్టార్ హీరో ఇంట్లో తలదాచుకున్నట్టు గుర్తించి అదుపులోకి!

గోవా ప్రాంతాల్లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాల్లో గాలింపు చర్యలు మొదలు పెట్టగా గోవాలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసారు. అక్కడి కోర్టు లో నేడు ఉదయం ఆయనని ప్రవేశ పరిచి పీటీ వారెంట్ క్రింద హైదరాబాద్ కి పోలీసులు తరలిస్తున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 19, 2024 / 01:28 PM IST

    Johnny Master Arrested

    Follow us on

    Johnny Master Arrested : అజ్ఞాతం లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేసారు. ఇటీవలే ఒక యంగ్ డ్యాన్సర్ జానీ మాస్టర్ తనపై అత్యాచారం చేసాడని, లైంగిక వేధింపులు తలపెట్టాడని, పెళ్లి చేసుకోమని బెదిరించాడని, లేకపోతే ఇండస్ట్రీ లో అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడని ఇలా పలు రకాల సంచలన ఆరోపణలతో ఆయనపై పోలీస్ కేసు నమోదు నార్సింగి పోలీస్ స్టేషన్ లో నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై పోలీసులు ‘పోస్కో’ చట్టం క్రింద కేసు ని నమోదు చేసి ఆయన కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. ముందుగా నార్త్ ఇండియా, నెల్లూరు పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. కానీ అక్కడ దొరకలేదు. బెంగళూరు, గోవా ప్రాంతాల్లో ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు ఆ ప్రాంతాల్లో గాలింపు చర్యలు మొదలు పెట్టగా గోవాలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసారు. అక్కడి కోర్టు లో నేడు ఉదయం ఆయనని ప్రవేశ పరిచి పీటీ వారెంట్ క్రింద హైదరాబాద్ కి పోలీసులు తరలిస్తున్నారు.

    మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే జానీ మాస్టర్ గోవా లో ఒక ప్రముఖ యంగ్ హీరో కి సంబంధించిన గెస్ట్ హౌస్ లో ఉండగా పోలీసులు పట్టుకున్నారని తెలుస్తుంది. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటన తో జానీ మాస్టర్ కెరీర్ ఇక ముగిసినట్టే అని అనుకోవాలి. ఎందుకంటే పోస్కో చట్టం క్రింద కేసు నమోదు అవ్వడం అనేది చిన్న విషయం కాదు. ఈ కేసు మీద బెయిల్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ, ఎలాంటి తప్పు చేయలేదని నిర్ధారణ అయితేనే బయటపడే అవకాశాలు ఉంటాయి. కానీ జానీ మాస్టర్ మౌనం చూస్తుంటే ఆయన తప్పు చేసినట్టే అని అందరికీ అనిపిస్తుంది. తనపై ఎలాంటి రూమర్ వచ్చినా వెంటనే రియాక్ట్ అయ్యి ఖండించే అలవాటు ఉన్న జానీ మాస్టర్, ఇంత మౌనం గా ఉండడం ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, ఎన్నికల ప్రచారాలలో మంచి ఉపన్యాసాలు ఇచ్చే జానీ మాస్టర్ లో ఇంత క్రూరత్వం ఉందా అని ఆయనని అభిమానించే వారు కూడా బాధపడుతున్నారు.

    మరో పక్క ఈ కేసు పై ఫిలిం ఛాంబర్ కూడా స్పందించింది. జానీ మాస్టర్ వ్యవహారం లో ఆ అమ్మాయికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, నిజా నిజాలు తెలుసుకొని జానీ మాస్టర్ పై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఒక ప్రెస్ మీట్ ద్వారా తెలియచేసారు. మరో పక్క జనసేన పార్టీ కూడా జానీ మాస్టర్ ని సస్పెండ్ చేసింది. పార్టీ కార్యక్రమాలకు ఇప్పటి నుండే దూరం గా ఉండాలని స్ట్రిక్ట్ గా ఆదేశాలు జారీ చేసింది. మరి జానీ మాస్టర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి. పాన్ ఇండియా లెవెల్ లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకొని, రెండుసార్లు నేషనల్ అవార్డుని సొంతం చేసుకున్న జానీ మాస్టర్, అమ్మాయి వ్యవహారం లో తప్పుగా ప్రవర్తించి కెరీర్ నే సర్వనాశనం చేసుకున్నాడు.