Homeఎంటర్టైన్మెంట్Watch Rocket Boys: ఓటీటీలో అద్భుతం చేస్తున్న పీరియాడిక్ సిరీస్, పదుల సంఖ్యలో అవార్డులు, డోంట్...

Watch Rocket Boys: ఓటీటీలో అద్భుతం చేస్తున్న పీరియాడిక్ సిరీస్, పదుల సంఖ్యలో అవార్డులు, డోంట్ మిస్!

Watch Rocket Boys: లెజెండరీ పీపుల్ బయోపిక్స్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ బెస్ట్ ఛాయిస్. అలాగే సాధారణ ప్రేక్షకులను సైతం అద్భుతమైన కథనంతో ఈ సిరీస్ కట్టిపడేస్తుంది. IMDB 8.8 రేటింగ్ సొంతం చేసుకున్న ఈ సిరీస్ ఏకంగా 43 అవార్డులను కొల్లగొట్టింది. ఇంతకీ ఏమిటా సిరీస్ అంటే.. రాకెట్ బాయ్స్(ROCKET BOYS). దేశానికి రాకెట్ సైన్స్ అందించడంలో కృషి చేసిన హోమి జహంగీర్ బాబా, విక్రమ్ సారా భాయ్ జీవిత చరిత్రల ఆధారంగా రాకెట్ బాయ్స్ రూపొందించారు. రాకెట్స్ రూపొందించడంలో భారత్ కి మొదటి దశలో ఎదురైన సవాళ్లు, పొలిటికల్ కండిషన్స్ ఆవిష్కరించారు.

1940 నుండి 1960ల కాలాల్లో ఈ సిరీస్ నడుస్తుంది. 2022లో మొదటి సిరీస్ విడుదల చేశారు. అనంతరం 2023లో సీజన్ 2 అందుబాటులోకి వచ్చింది. ఒక్కో సిరీస్ 8 ఎపిసోడ్స్ చొప్పున 16 ఎపిసోడ్స్ స్ట్రీమ్ అవుతున్నాయి. రాకెట్ బాయ్స్ సిరీస్ లో రెజీనా కాసాండ్రా, జిమ్ సర్బ్, ఇష్వాక్ సింగ్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సిరీస్ కి అభయ్ పన్ను దర్శకత్వం వహించారు. ప్రధాన పాత్రలు చేసిన నటుల అభినయం ఆద్యంతం అలరిస్తుంది.

Also Read: దిల్ రాజు బ్యానర్ లో అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ మూవీ..స్టోరీ లైన్ వింటే మెంటలెక్కపోతారు!

జహంగీర్ బాబా రోల్ చేసిన జిమ్ సర్బ్ దాదా సాహెబ్ పాల్కే అవార్డు అందుకోవడం విశేషం. ఉత్తమ స్క్రీన్ ప్లే, డైరెక్షన్ విభాగంలో రాకెట్ బాయ్స్ ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకుంది. రాకెట్ బాయ్స్ సిరీస్ సోనీ లివ్ లో అందుబాటులో ఉంది. ఆసక్తికర మలుపులతో పాటు, సున్నితమైన భావోద్వేగాలు, ఆనాటి పొలిటికల్, ఎకనామిక్ కండిషన్స్ రాకెట్ బాయ్స్ సిరీస్ లో ఆవిష్కరించారు.

Also Read: తమ్ముడు సినిమా ‘సెన్సార్’ రివ్యూ వచ్చేసింది.. : టాక్ ఎలా ఉందంటే?

సిద్ధార్థ్ రాయ్ కపూర్ ఈ సిరీస్ ని నిర్మించారు. అచిన్ట్ టక్కర్ మ్యూజిక్ సైతం అలరిస్తుంది. రాకెట్ బాయ్స్ తప్పక చూడాల్సిన సిరీస్. ప్రస్తుతం అంతరిక్ష ప్రయోగాలలో భారత్ ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీ పడుతుండగా, అందుకు భీజం ఎలా పడిందో తెలుసుకోవచ్చు.

Exit mobile version