HomeతెలంగాణTelangana Politics : నిజంగా కేసీఆర్‌ సాధించాడు.. కాంగ్రెస్‌ నమ్మాలి.. నడిపించాలి

Telangana Politics : నిజంగా కేసీఆర్‌ సాధించాడు.. కాంగ్రెస్‌ నమ్మాలి.. నడిపించాలి

Telangana Politics: తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటింది. రూ.60 వేల కోట్ల అప్పుతో ఏర్పడిన తెలంగాణలో నాడు విద్యుత్‌ కోతలు, నీటి వనరుల కొరత, నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉండేది. ఈ సమయంలో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్‌ అలియాస్‌ టీఆర్‌ఎస్‌.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సమర్థవంతమైన పాలన, ముందస్తు వ్యూహాలతో తెలంగాణలో విద్యుత్‌ కోతలు లేకుండా చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ప్రకటించారు. నీటి వనరుల అభివృద్ధిపై దృష్టిపెట్టారు. ఫలితంగా తెలంగాణ ప్రస్తుతం ధాన్యం దిగుబడిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇది నిజంగా కేసీఆర్‌ కృషి ఫలితమే. దీనిని అందరూ అంగీకరించాల్సిందే.

ఒక మైలురాయి…
తెలంగాణ రాష్ట్రం ధాన్యం ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానానికి చేరుకోవడం ఒక మైలురాయి. ఈ విజయం వెనుక మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కృషిని అందరూ అభినందించాల్సిందే. తెలంగాణ రాష్ట్రం గత పదేళ్లలో ధాన్యం ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించి, దేశంలోని ఇతర రాష్ట్రాలైన పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌లను అధిగమించింది. దీనివెనుక తెలంగాణ రైతుల కృషి, ప్రభుత్వ విధానాలు, సాగునీటి సౌకర్యాల విస్తరణ, కేసీఆర్‌ కృషి ఉన్నాయి. కానీ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఈ విజయాన్ని తక్కువ చేస్తూ కేసీఆర్‌ను దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది.

Also Read: శ్రీదేవి నిర్మాతగా చిరంజీవి ఏకైక మూవీ, అనూహ్య ఫలితం, ఏంటా చిత్రం?

తెలంగాణ నంబర్‌ వన్‌..
తెలంగాణ రాష్ట్రం గత దశాబ్దంలో ధాన్యం ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది. ఈ పెరుగుదల పంజాబ్, ఆంధ్రప్రదేశ్‌ వంటి సంప్రదాయ వ్యవసాయ రాష్ట్రాలను అధిగమించడానికి దోహదపడింది. ఈ విజయం వెనుక సాగునీటి పథకాలు, రైతు సంక్షేమ కార్యక్రమాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి. కేసీఆర్‌ నాయకత్వంలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు రైతులకు స్థిరమైన నీటి సరఫరాను అందించాయి, దీనివల్ల ధాన్యం దిగుబడి పెరిగింది. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలు రైతులకు ఆర్థిక సహాయం అందించి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు శిక్షణ కార్యక్రమాలు రైతుల సామర్థ్యాన్ని మెరుగుపరిచాయి.

కేసీఆర్‌ ప్రత్యేక ప్రణాళిక..
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ రాష్ట్రాన్ని పాలించాయి. కానీ, వ్యవసాయంపై అవి పెద్దగా దృష్టి పెట్టలేదు. వ్యవసాయం దండగ అని వ్యాఖ్యానించిన నేతలూ ఉన్నారు. కానీ కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగ చేయాలని సంకల్పించారు. ఈ క్రమంలో రైతు సంక్షేమంపై దృష్టి సారించడం, సాగునీటి సౌకర్యాలను మెరుగుపరచడం, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం ఈ విజయానికి కీలకమైనవి. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రం సాధించలేని విజయాన్ని తెలంగాణ రైతులు సాధించేలా కృషి చేశారు.
కాంగ్రెస్‌ ఆరోపణలు..
కాంగ్రెస్‌ పార్టీ కేసీఆర్‌ను దోషిగా చిత్రీకరిస్తూ, ఈ విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నంలో ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు రాజకీయ లాభం కోసం ఉద్దేశించినవిగా కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హయాంలో ఇలాంటి ఫలితాలను సాధించలేకపోవడం ఈ విమర్శలకు ఆజ్యం పోస్తోంది. తెలంగాణ ధాన్యం ఉత్పత్తి విజయం రాజకీయంగా వివాదాస్పదంగా మారడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మధ్య రాజకీయ శత్రుత్వం. కాంగ్రెస్‌ ఈ విజయాన్ని తమ గత పాలనలో లేని విధంగా చూపించడం ద్వారా కేసీఆర్‌పై రాజకీయ ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. వాస్తవాలను వక్రీకరించకుండా అభివృద్ధిని కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version