Thammudu Movie Censor Review: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఒక హీరో ఒక సినిమాతో సక్సెస్ ని సాధించాలంటే చాలా వరకు కసరత్తులను చేయాల్సిన అవసరమైతే ఉంది. ముందుగా కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక మంచి కథ దొరికినప్పుడే సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తోంది. అలా కాకుండా ఏది పడితే ఆ కథతో సినిమా చేస్తే హీరోల కెరియర్ డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది…
Also Read: విశ్వక్ సేన్ చిత్రంలో బాలయ్య..ఫ్యాన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయే అప్డేట్
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక నితిన్ (Nithin) లాంటి యంగ్ హీరో సైతం ప్రస్తుతం మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఆయన చేసిన సినిమాలేవి అంత పెద్దగా వర్కౌట్ అయితే అవ్వట్లేదు. వరుసగా డిజాస్టర్లను మూట గట్టుకుంటున్నాడు. భీష్మ(Bishma) సినిమా తర్వాత ఆయన చేసిన ఏ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోవడం విశేషం…ఇక ఇప్పుడు దిల్ రాజు ప్రొడక్షన్లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో చేసిన తమ్ముడు (Thammudu) సినిమా రేపు రిలీజ్ అవుతోంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికెట్ అయితే వచ్చింది. ఇక సెన్సార్ బోర్డు వాళ్ళు ఇచ్చిన రివ్యూను బట్టి చూస్తే ఈ సినిమా ఒక ట్రైబల్ ఏరియాలో ఎక్కువ భాగం నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే ట్రైబల్ ఏరియాలో ఉన్న ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వాళ్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి హీరో ఏం చేశాడు అనేదే ఇక్కడ కోర్ పాయింట్ గా తీసుకొని సినిమాను చేశారు.
ఇందులో అక్క ఎమోషన్ ని చాలా బాగా వర్కౌట్ చేసే విధంగా సినిమాని తెరకెక్కించడం నిజంగా చాలా మంచి విషయమే అయితే ఈ సినిమా ఎమోషనల్ గా బాగా వర్కౌట్ అయినప్పటికి కథ రొటీన్ గా ఉండడం అనేది ఈ సినిమాకి చాలా వరకు మైనస్ గా మారే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తున్నాయి…
అలాగే కొన్ని పాయింట్లు కూడా సినిమాలో అంత బాగా లేవనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక నితిన్, లయ సప్తమి గౌడ ల క్యారెక్టర్స్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవ్వబోతున్నాయట… అంజనీష్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయినట్టుగా తెలుస్తోంది…
ఈ సినిమా ఫైనల్ గా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనేది తెలియాలంటే ఇంకో 24 గంటల పాటు వేచి చూడాల్సిన అవసరమైతే ఉంది… ఇప్పటివరకు కి వస్తున్న వరుస ప్లాప్ లకు చెక్ పెట్టి ఈ సినిమా సూపర్ సక్సెస్ ని సాధిస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…