Peddi : ఈమధ్య కాలంలో ఒక సినిమాపై భారీ అంచనాలు ఏర్పడి, బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్స్ నుండే 50 శాతం కి పైగా రికవరీ చేసే రేంజ్ వసూళ్లు రావాలంటే, కచ్చితంగా ప్రమోషనల్ కంటెంట్ ఫ్యాన్స్ ని, ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉండాలి. లేకపోతే ఎంత పెద్ద సూపర్ స్టార్ సినిమా అయినా బోల్తా కొట్టాల్సిందే. ఈ ఏడాది విడుదలైన ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం అందుకు ఒక ఉదాహరణ. రామ్ చరణ్(Global Star Ram Charan) స్థాయి వేరు, #RRR తో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఆయన నుండి ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా కొత్తగా ఉండాలి, ట్రెండ్ కి తగ్గట్టుగా ఉండాలని అందరు కోరుకుంటారు, కానీ చరణ్ ఏంటి ఇలాంటి రొటీన్ పొలిటికల్ డ్రామా తో వస్తున్నాడు?, అని ఈ సినిమా టీజర్ విడుదలైనప్పుడు అందరూ మాట్లాడుకున్నారు. ఫలితంగా ఆ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ నుండే ఊపు రాలేదు.
Also Read : ‘పెద్ది’ మూవీ పూర్తి స్టోరీ ఇదే..సరిగ్గా తీస్తే ‘దంగల్’ ని మించిన సినిమా అవుద్ది!
మొదటి రోజే 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తాయని అనుకుంటే, కేవలం 86 కోట్ల రూపాయిల గ్రాస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. క్లోజింగ్ లో కేవలం 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. శంకర్ మీద గౌరవం తో, ఆబ్లిగేషన్ మీద రామ్ చరణ్ చేసిన సినిమా ఇది అని అందరికీ అర్థం అయ్యింది. ఇక నుండి ఆబ్లిగేషన్స్ లేవు, కేవలం ఫ్యాన్స్ ఎమోషన్స్ ని మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని రామ్ చరణ్ ఫిక్స్ అయ్యాడు. అందులో భాగంగానే ‘పెద్ది'(Peddi Movie) చిత్రం ఒప్పుకున్నాడు. శ్రీరామ నవమి కానుకగా ఈ చిత్రం నుండి విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి నేషనల్ లెవెల్ లో ఎలాంటి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిందో మనమంతా చూసాము. ముఖ్యంగా గ్లింప్స్ వీడియో చివర్లో రామ్ చరణ్ కొట్టిన షాట్ దెబ్బకు సినిమా లాంగ్వేజ్ లో చెప్పాలంటే బౌండరీలు బ్లాస్ట్ అయ్యాయి అనొచ్చు.
క్రికెట్ లో ఇది వరకు మన ఫేవరేట్ క్రికెటర్స్ ద్వారా ఎన్నో అద్భుతమైన ట్రేడ్ మార్క్ షాట్స్ ని చూసి ఉంటాము. కానీ పెద్ది గ్లింప్స్ లో చూపించిన షాట్ ఇప్పటి వరకు మనం క్రికెట్ హిస్టరీ లోనే చూడలేదు. భవిష్యత్తులో ఈ షాట్ ని మన క్రికెటర్స్ మ్యాచులలో ప్రయత్నం చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన హిందీ వెర్షన్ గ్లింప్స్ వీడియో ని విడుదల చేసారు. 24 గంటలు కూడా గడవకముందే ఈ వీడియోకి 30 లక్షలకు పైగా వ్యూస్, లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. బాలీవుడ్ ఆడియన్స్ ఆ షాట్ గురించి సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఈ గ్లింప్స్ వీడియో తర్వాత ఒక ప్రముఖ బాలీవుడ్ బడా నిర్మాత ఈ సినిమా హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నాడని, వంద కోట్ల రూపాయిల ఆఫర్ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : రంగస్థలం, త్రిబుల్ ఆర్ లానే పెద్ది మూవీ సూపర్ సక్సెస్ అవుతుందా..?