spot_img
Homeఎంటర్టైన్మెంట్Peddi Overseas Advance Bookings: 'పెద్ది' ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇంత తక్కువ ఉందేంటి.....

Peddi Overseas Advance Bookings: ‘పెద్ది’ ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ ఇంత తక్కువ ఉందేంటి.. అసలు ఊహించలేదుగా..

Peddi Overseas Advance Bookings: ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటించిన ‘పెద్ది'(Peddi Movie) చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతి తర్వాత టాలీవుడ్ కి ఒక్కటంటే ఒక్క సరైన బ్లాక్ బస్టర్ లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఈ సమయం లో మార్కెట్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ‘పెద్ది’ చిత్రం కచ్చితంగా టాలీవుడ్ కి కొత్త ఊపిరి ని ఇస్తుంది అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా చెప్పినట్టుగానే ఏప్రిల్ 30 న విడుదల అవుతుందా లేదా వాయిదాపడి జూన్ 25 కి వెళ్తుందా అనే దానిపై మేకర్స్ నుండి స్పష్టమైన సమాచారం రాలేదు. రామ్ చరణ్ అయితే ఏప్రిల్ 30 నే విడుదల అవుతుందని మొన్న కూడా చెప్పుకొచ్చాడు.

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో మొదలయ్యాయి. అక్కడి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం , ఇప్పటి వరకు ఈ చిత్రానికి 7 వేల డాలర్లు మాత్రమే వచ్చిందట. షోస్ దాదాపుగా 641 వరకు షెడ్యూల్ చేశారు. అయితే అవి కేవలం లిస్టింగ్ అయినవి మాత్రమే. బుకింగ్స్ చేసుకోవడానికి అందుబాటులో ఉన్న షోస్ కేవలం 200 మాత్రమే. అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ కి ఇది చాలా అంటే చాలా తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కి ‘ఓజీ’ , ‘పుష్ప 2’, ‘దేవర’ ప్రీమియర్ షోస్ గ్రాస్ బద్దలు అవుతుందని అంతా ఆశించారు. కానీ ఆ రేంజ్ గ్రాస్ వచ్చే సూచనలు అయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు.

ఇంత తక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడానికి ముఖ్య కారణం , ఈ సినిమా వాయిదా పడుతుందని ఎక్కువ శాతం మంది నమ్మడం వల్లే. అభిమానుల్లో కూడా ఈ చిత్రం ఏప్రిల్ 30 న విడుదల అవుతుందనే నమ్మకం లేదు. ఏప్రిల్ 8 న నార్త్ అమెరికా లో పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు కాబోతున్నాయి. కనీసం అప్పటికైనా ఈ సినిమా విడుదల తేదీ లాక్ అవుతుందో లేదో చూడాలి. ఒకవేళ లాక్ అవ్వకపోతే మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైనప్పటికీ కూడా తక్కువ గ్రాస్ ని చూడాల్సి ఉంటుంది. ‘పెద్ది’ వంటి భారీ క్రేజ్ ఉన్న సినిమాలకు ఇలాంటివి జరగడం దురదృష్టకరంగానే భావించాలి. ఈ సినిమా అనుకున్న సమయానికి వస్తుందా లేదా అనేది మ్యూజిక్ డైరెక్టర్ AR రెహ్మాన్ చేతుల్లోనే ఉంది. ఆయనకు సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. చూడాలి మరి ఈ చిత్రం అనుకున్న తేదికి వస్తుందా లేదా వాయిదా పడుతుందా అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular