Sukumar Review On Peddi: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే మన స్టార్ హీరోలందరు ఎవరి పంథాలో వాళ్ళు ముందుకు దూసుకెళ్తుతూ వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎలివేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే రామ్ చరణ్ సైతం డిఫరెంట్ సినిమాలను చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను గ్లోబల్ స్టార్ గా అవతరించిన తర్వాత ఆయనకు సరైన సక్సెస్ అయితే రాలేదు. గేమ్ చేంజర్ సినిమాతో ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేకపోయాడు. అయితే ప్రస్తుతం పెద్ది సినిమాతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నంతో ఉన్నాడు. జూన్ 4వ తేదీన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా మీద డైరెక్టర్ సుకుమార్ తన మొదటి రివ్యూ ఇచ్చేశాడు.రీసెంట్ గా ఈ సినిమా చూసిన ఆయన ఈ మూవీ చాలా అద్భుతంగా ఉందని ముఖ్యంగా ఇంటర్వెల్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెప్పాడు. అలాగే సెకండాఫ్ లో వచ్చే కుస్తీ ఫైట్ సినిమా మొత్తానికి స్పెషల్ అట్రాక్షన్ గా నిలబోతుందట.
క్లైమాక్స్లో రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని కూడా చూడబోతున్నాం అంటు ఆయన తన సన్నిహితుల దగ్గర చెబుతున్నాడు. మొత్తానికైతే ఈ సినిమా మీద సుకుమార్ చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నాడు. ఇక బుచ్చిబాబు సైతం ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాలని కూడా స్టార్ట్ అయినట్లు చేరిపోతారనే ఉద్దేశ్యంతో చాలా వరకు స్పెషల్ కేర్ తీసుకొని మరి ఈ సినిమాని చిత్రీకరించాడు…
ఈ సినిమా పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో ఉన్న భారీ రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరొక 20 రోజులపాటు వేచి చూడాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ఇక ఇప్పటికే రామ్ చరణ్ క్రేజ్ తార స్థాయిలో ఉంది. కాబట్టి ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ సక్సెస్ ను సాధిస్తే తను తాను ఇండియాలో నెంబర్ వన్ రేస్ లో మరింత ముందుకు వస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…
