Peddi Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఢిల్లీ పోలీస్ స్టేషన్ బయట నిల్చుకోవడం ఏంటి?, అసలు ఏమైంది? అని కంగారు పడుతున్నారా?.. ఏమి కాలేదు, ఇది పెద్ది మూవీ షూటింగ్ కి సంబంధించినది. రీసెంట్ గానే ఈ సినిమాకు సంబందించిన సరికొత్త షెడ్యూల్ ని ఢిల్లీ లో మొదలుపెట్టారు. అక్కడ రామ్ చరణ్ పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ఇది నిజమైన షూటింగ్ లొకేషన్ ఫోటోలేనా??, లేదంటే AI ఫోటోలా? అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి.కానీ విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం చూస్తుంటే అది నిజమైన ఫొటోలే అని తెలుస్తోంది.
మరో నాలుగు రోజుల పాటు ఈ ఢిల్లీ షెడ్యూల్ సాగనుంది. ఇకపోతే రీసెంట్ గానే ఈ చిత్రం నుండి విడుదలైన ‘చికిరి.. చికిరి’ పాట గ్లోబల్ వైడ్ గా ఇలాంటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కేవలం తెలుగు వెర్షన్ పాటకు 107 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రాబోయే రోజుల్లో అన్ని బాషలకు కలిపి ఈ పాట 200 మిలియన్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. ఈ పాట ఈ చిత్రం పై పెంచిన అంచనాలు సాధారణమైనవి కావు. ఇప్పటికిప్పుడు ఈ చిత్రాన్ని విడుదల చేసినా 150 కోట్ల గ్రాస్ ఓపెనింగ్ ని అందుకోగలదు. ఆ రేంజ్ క్రేజ్ పెద్ది చిత్రం పై ఉన్నాయి.
రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా మార్చ్ 27 న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. కానీ అందుకు జనవరి నెలాఖరు లోపు షూటింగ్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదంటే ఈ చిత్రం అనుకున్న సమయానికి విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు. మరో వైపు నాని ‘ది ప్యారదైజ్’ చిత్రం కూడా మార్చ్ 26న విడుదల అవ్వబోతుంది. కచ్చితంగా ఈ రెండు సినిమాల్లో ఎదో ఒకటి వెనక్కి వెళ్లాల్సి వస్తుంది. ఏ సినిమా వెనక్కి వెళ్తుందో చూడాలి.
Whatta wow. @AlwaysRamCharan pic.twitter.com/ulXDHW6N4T
— Likitha. (@SRKTweetDiary) December 21, 2025