Sharmila And Jagan: ఆస్తులు, ఇంకా అనేక రకాల వివాదాలతో కొంతకాలంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటున్నది. రాజకీయంగా షర్మిల జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియా వింగ్ కూడా షర్మిల మీద రాయడానికి వీలు లేని భాషలో ఆరోపణలు చేస్తున్నారు..
జగన్, షర్మిల మధ్య ఆస్తుల వివాదాలు కొనసాగుతున్నాయి.. ఇప్పటికే షర్మిల అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డికి నోటీసులు పంపించారు. జగన్ కూడా అదే పని చేశారు. షర్మిల తనయుడి ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి హాజరైన జగన్.. పెళ్లికి మాత్రం వెళ్ళలేదు. దీంతో వారిద్దరి మధ్య విభేదాలు మరింత పెరిగిపోయాయి. వీరిద్దరి మధ్య ఆగాదాన్ని పూడ్చడానికి చాలామంది ప్రయత్నాలు చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. అయితే ఇప్పుడు షర్మిల, జగన్ కలిసిపోయారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఆదివారం జగన్మోహన్ రెడ్డి జన్మదినం.. ఈ సందర్భంగా సోదరి షర్మిల సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో రాజకీయ విశ్లేషకులు వారిద్దరు కలిసిపోయారని ప్రచారం చేస్తున్నారు. జగన్ పుట్టినరోజు కాబట్టి.. పైగా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి షర్మిల సోషల్ మీడియా వేదిక శుభాకాంక్షలు తెలియజేశారని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వారిద్దరూ కలిసి పోలేదని.. సోదరుడు కాబట్టి.. అందులోనూ అతడి జన్మదినం కాబట్టి షర్మిల శుభాకాంక్షలు తెలియజేశారని వారు గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని.. ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలని సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ కోరారు.. పవన్ కళ్యాణ్, షర్మిల చేసిన ట్వీట్లు ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో సంచలనంగా మారాయి.
మరోవైపు వైసీపీ నాయకులు ఏపీవ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. రక్తదానాలు.. రోగులకు ఆహారం పంపిణీ.. దుస్తుల అందజేత వంటి కార్యక్రమాలను చేస్తున్నారు.. ప్రపంచ దేశాలలో ఉన్న వైసిపి నాయకులు కూడా జగన్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. షర్మిల, పవన్ మాత్రమే కాకుండా.. ఇంకా చాలామంది రాజకీయ నాయకులు సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు.
YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి @ysjagan గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.
— YS Sharmila (@realyssharmila) December 21, 2025