Peddi movie climax details: ఒక సినిమా తీసి సక్సెస్ ను సాధించడం అంటే మామూలు విషయం కాదు. దానికి దర్శకుడు అహర్నిశలు కష్టపడాలి. 24 క్రాఫ్ట్స్ లో ఉన్న వాళ్ళందరిని ఏకం చేసి బెస్ట్ ఔట్ పుట్ ను తీసుకురావడంలో దర్శకుడు కీలకపాత్ర వహిస్తాడు. అందులో ఏమాత్రం తేడా జరిగిన కూడా సినిమా మొత్తానికి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఒక సినిమాను తీసి దానిని సక్సెస్ ఫుల్ గా నిలపడమంటే దర్శకుడికి కత్తి మీద సాము లాంటిది. అలాంటి క్రమంలోనే చాలామంది దర్శకులు గొప్ప సినిమాలను చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ‘ఉప్పెన’ సినిమాతో భారీ సంచలన విజయాన్ని సాధించిన బుచ్చిబాబు ప్రస్తుతం రామ్ చరణ్ తో ‘పెద్ది’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం…ఇక పెద్ది సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ పూర్తయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే పెద్ది సినిమా క్లైమాక్స్ ప్రతి ఒక్కరి హృదయాలను రంజింపజేసేలా ఉండబోతుందట.
క్లైమాక్స్‌లో రామ్ చరణ్ చనిపోబోతున్నాడు అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఆయన గేమ్ కోసం ఎక్కడి దాకైనా వెళ్లగలిగే ఒక స్పిరిట్ ఉన్న వ్యక్తిగా ఈ సినిమాలో కనిపిస్తాడట. చివరికి ఆయన కెరీర్ ని ఫణంగా పెట్టి కూడా తన గేమ్ ని ఎలా గెలిపించాడు అనేది ఈ సినిమా స్టోరీ గా తెలుస్తుంది.
Also Read: గద్దర్ అవార్డు లను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం…చిరంజీవి, కమల్ హాసన్ లకు ప్రత్యేక అవార్డులు…
ఇక రామ్ చరణ్ ఈ సినిమా క్లైమాక్స్ లో చనిపోవడం ప్రేక్షకులు జీర్ణించుకుంటారా ? తన అభిమానుల నుంచి ఎలాంటి విమర్శలు రాబోతున్నాయి అనేది ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటిని రేకెత్తిస్తుంది. ఇక దీనికి బుచ్చిబాబు సైతం ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ను జోడించి మరి క్లైమాక్స్ ని డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.
రామ్ చరణ్ చిరంజీవి లాంటి వారు సైతం ఆ క్లైమాక్స్ కి ఇంప్రెస్ అయ్యారు అంటే ప్రతి ఆడియన్ ఇంప్రెస్ అవుతారని వాళ్ళు భావిస్తున్నారట. ఇక ఏప్రిల్ 30వ తేదీ వస్తే గాని ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుంది ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధించబోతుంది అనే విషయంలో సరైన క్లారిటీ రాదు…