Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు ఏ సినిమా చేసినా కూడా అందులో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. వరుసగా నాలుగు విజయాలతో చెలరేగిపోయాడు. బోయపాటి డైరెక్షన్లో వచ్చిన ‘అఖండ 2’ సినిమాతో కొంతవరకు డీలాపడ్డాడు. అయినప్పటికి ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మరోసారి సంచలనాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఆయన డిఫరెంట్ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్న క్రమంలో చాలామంది దర్శకులు అతని దగ్గరికి కమర్షియల్ సినిమాలను తీసుకొని వస్తున్నారు. తద్వారా ఆయన కూడా సేఫ్ జోన్ లో ఉండటానికి అలాంటి సినిమాలను చేస్తున్నాడు. తెలుగులో బాలయ్య స్టార్ హీరోగా వెలుగొందుతున్న విషయం మనకు తెలిసిందే.
ఒక తమిళ దర్శకుడు మాత్రం బాలయ్య బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నాడు అంటూ అతని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రజనీకాంత్ హీరోగా ‘జైలర్ 2’ సినిమా వస్తుంది. ఈ మూవీ డైరెక్టర్ అయిన నెల్సన్ ఈ సినిమాలో బాలయ్య బాబుతో ఒక క్యామియో రోల్ చేయించాడు.
అతని మీద రెండు రోజులపాటు షూటింగ్ కూడా జరిగింది. అలాంటిది ఇప్పుడు బాలయ్య బాబు చేసిన సన్నివేశాన్ని సినిమా నుంచి తీసేస్తున్నారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ ను పెట్టి ఒక క్యామియో రోల్ చేయించారు. దాంతో హృతిక్ రోషన్ ది సినిమాలో పెట్టి బాలయ్య బాబుది తీసేద్దాం అనే ఆలోచనలో డైరెక్టర్ ఉన్నాడట.
ఇలా కనక చేసినట్లయితే మాత్రం బాలయ్య బాబును అవమానించినట్టు అవుతుంది అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా రిలీజ్ అయితే గాని బాలయ్య చేసిన క్యామియో రోల్ ఉంటుందా లేదా అనే దానిమీద సరైన క్లారిటీ వచ్చే అవకాశమైతే లేదు… చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు. ప్రేక్షకుల్లో ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతుంది అనేది…
