Pawan’s son : సింగపూర్ సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ సమీపం లోని రోడ్ వ్యాలీ రోడ్డు లోని మూడు అంతస్తులకే భవనం లో ఏప్రిల్ 8న అగ్ని ప్రమాదం జరగడం, ఈ అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కొడుకు మార్క్ శంకర్(Mark Shankar) తో పాటు 15 మంది పిల్లలు చిక్కుకొని గాయాలపాలవ్వడం మన అందరికి తెలిసిందే. ఏడేళ్ల వయస్సు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కి గాయాలు అయ్యాయి అనే వార్త రెండు మూడు రోజుల నుండి లోకల్ నుండి నేషనల్ మీడియా వరకు చర్చగా మారింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడే పని చేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు గమనించారు. దూరం నుండి పిల్లల ఆర్తనాధాలు విని, ఫైర్ ఇంజిన్, అంబులెన్స్ రాక ముందే సహాయక చర్యలు తలపెట్టి అందరినీ రక్షించారు. కాపాడిన వారిలో భారత కార్మికులు కూడా ఉండడం గమనార్హం.
Also Read : ‘చిన్నారి వారియర్ కోలుకోవాలి’..పవన్ చిన్న కొడుకు పై ఎన్టీఆర్ ట్వీట్!
తమ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, ఆపదలో ఉన్న చిన్నారుల ప్రాణాలను కాపాడిన ఆ నలుగురు భారత కార్మికులకు సింగపూర్ ప్రభుత్వం ప్రత్యేకించి సన్మానం చేసింది. సాధారణంగానే సహాయం చేయడం లో ఎప్పుడు ముందుండే పవన్ కళ్యాణ్ తన బిడ్డ ప్రాణాలను కాపాడిన ఈ కార్మికులకు ఏమైనా సహాయం చేశాడా లేదా అనేది ఇప్పుడు సోషల్ మీడియా లో నడుస్తున్న చర్చ. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాడు. ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోవాల్సిన అవసరం ఉందని, మా కుల దైవం ఆంజనేయ స్వామి ఆశీస్సులతో త్వరలోనే పూర్తి స్థాయిలో కోలుకుంటాడని మెగాస్టార్ చిరంజీవి ఇటీవలే ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలిపిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన కొడుకు తో కలిసి సింగపూర్ లోనే ఉంటున్నాడు. సోమవారం రోజున ఆయన మళ్ళీ ఇండియా లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది.
ఇండియా కి వచ్చిన వెంటనే ఆయన ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu Movie) మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు. వచ్చే నెల 9వ తారీఖున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మళ్ళీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా లో ప్రచారం జరగడంతో, మూవీ టీం మరోసారి నిన్న మే9 న విడుదల అవుతున్నట్టు అధికారికంగా ఖరారు చేసింది. సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు వాయు వేగంతో జరుగుతున్నాయని, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన రెండు పాటలు, మేకింగ్ వీడియో మరియు థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయబోతున్నామని చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఈ నెల 25 న ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే వీటి అన్నిటికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఈ నెల 22న సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.
Also Read : ఛీ మారరు.. పవన్ కుమారుడుపై చీప్ కామెంట్స్.. పోలీసులు సీరియస్!