Cricket In Olympics 2028: ఒలింపిక్స్‌లో ఆడాలని చాలా మంది కలలు కంటారు. అయితే ఇందులో కొన్ని రకాల గేమ్స్ ఉన్నాయి. కానీ క్రికెట్ లేదు. అయితే ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా తీసుకురావాలని ప్రతిపాదించారు. దీనికి ఐఓసీ క్లారిటీ ఇచ్చింది. ఇకపై క్రికెట్ కూడా ఒలింపిక్స్‌లో ఉంటుందని తెలిపింది. నిజానికి ఒలింపిక్స్ క్రీడలకు ఎంతో పాపులారిటీ ఉంది. ఇలాంటి పాపులారిటీ ఉన్న దాంట్లో అందరికీ ఇష్టమైన క్రికెట్ మాత్రం లేదు. ఇందులో కూడా క్రికెట్ ఉండాలని స్పోర్ట్స్ లవర్స్ చాలా మంది కోరుకున్నారు. ఫైనల్‌గా ఇకపై ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా చేరింది. అయితే నాలుగేళ్లకు ఒకసారి ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయి. గతేడాది ఒలింపిక్స్ క్రీడలు జరగ్గా మళ్లీ 2028లో ఒలింపిక్స్ క్రీడలు జరగనున్నాయి. అయితే వీటికి లాస్ ఏంజిల్స్ అతిథ్యం ఇవ్వనుంది. ఈ వేదికలో క్రికెట్ జట్లు ఆడుతాయి. మొదటిసారి ఒలింపిక్స్‌లో క్రికెట్ ఆడుతారు.
Also Read: అరే.. ఈ దుమ్మేందిరా బై.. ఉరికి రండి.. రోహిత్ వీడియో వైరల్
128 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత క్రికెట్ ఒలింపిక్స్‌లో ఒక భాగం అవుతుంది. అయితే ఇందులో మెన్స్‌తో పాటు ఉమెన్స్ టీమ్‌లు కూడా పోటీపడనున్నాయి. అయితే ఇద్దరికీ కలిపి కాకుండా.. వేర్వేరుగా నిర్వహిస్తారు. అయితే ఈ ఒలింపిక్స్‌లో కేవలం ఆరు జట్లు మాత్రమే పాల్గొంటాయి. టీ20 ఫార్మాట్‌లో వీటిని నిర్వహిస్తారు. అయితే ర్యాకింగ్స్ బట్టి క్రికెట్ జట్లును ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇండియా ర్యాకింగ్ చూస్తే 20170 పాయింట్లు ఉంది. టీమిండియా ఒలింపిక్స్‌లో తప్పకుండా ఆడుతుందని ఉంది. అయితే వీటిపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ ఒలింపిక్స్‌లో పాకిస్థాన్ జట్టుకు ఛాన్స్ లేకపోవచ్చు. ఎందుకంటే అంతర్జాతీయంగా పాయింట్ల పట్టికల బట్టి చూస్తే చాలా తక్కువగా ర్యాకింగ్స్‌లో ఉంది. అయితే ఈ ఒలింపిక్స్ జరగడానికి ఇంకా చాలా సమయం ఉంది. కాబట్టి ఇంకా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. మరి ఏయే జట్లు ఇందులో అర్హత సాధిస్తాయో చూడాలి.
ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్ వంటి ఆటలను కూడా స్టార్ట్ చేశారు. అయితే 1896లో ఏథెన్స్‌లో మొదట ఒలింపిక్స్ క్రీడలు జరిగాయి. ఇందులో 9 క్రీడాంశాలు ఉండేవి. కత్తియుద్ధం, జిమ్నాస్టిక్స్, అథ్లెటిక్స్, సైక్లింగ్, బరువులెత్తడం, ఈతలపోటీలు, షూటింగ్, టెన్నిస్, మల్లయుద్ధం. ఆ తర్వాత ఇవి పెరిగి 28 క్రీడలు అయ్యాయి. అయితే శీతాకాలపు ఒలింపిక్స్‌తో కలిపి మొత్తం 35 క్రీడలు ఉన్నాయి. అయితే ఒలింపిక్స్‌లో కూడా నాలుగు రకాలు ఉన్నాయి. సమ్మర్ ఒలింపిక్స్, వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్, యూత్ ఒలింపిక్స్ వంటివి ఉన్నాయి. అయితే సమ్మర్ ఒలింపిక్స్ లానే వింటర్ ఒలింపిక్స్ కూడా ప్రతి నాలుగు ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. 1994 నుంచి వేసవి, వింటర్ గేమ్స్ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మారుతూ వస్తున్నాయి.