Ustad Bhagat Singh Movie Shoot: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ లో పరిస్థితి బాగాలేనట్టుగా తెలుస్తోంది… వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా ప్లాప్ టాక్ ను తెచ్చుకున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఇక మీదట రాబోయే సినిమా విషయంలో మన దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే సినీ కార్మికులు వాళ్ల వేతనాలను పెంచేందుకు సమ్మె నిర్వహిస్తున్న నేపథ్యంలో ఫిలిం ఛాంబర్ లో ప్రొడ్యూసర్స్ అందరు సమావేశమవుతున్నారు. సినీ కార్మికుల ఇబ్బందులను తెలుసుకొని దాని మీద చర్చలు జరిపి వాళ్ళకి తగిన న్యాయం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే అల్లు అరవింద్, నాగవంశీ, శివలెంక కృష్ణ ప్రసాద్, మైత్రి రవి, సురేష్ బాబు, ఠాగూర్ మధు,రాధ మోహన్, ఫెడరేషన్ సభ్యులు, ఫిలిం ఛాంబర్ సభ్యులు అందరు ఈ మీటింగ్ కి హాజరవుతున్నారు…ఇక ఈ మీటింగ్ లో ప్రతి ఒక్క నిర్మాత వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తూ సినీ కార్మికులకు సరైన న్యాయం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఇదిలా ఉంటే అన్నపూర్ణ స్టూడియో లో జరగాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ ను నిలిపివేసినట్టుగా తెలుస్తోంది…
Also Read: కూలీ సినిమాలో ప్రభాస్… ఊహించని ట్విస్ట్
దానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ముంబై నుంచి టెక్నీషియన్స్ ను తీసుకువచ్చి షూటింగ్ చేస్తున్నారనే ఉద్దేశ్యంతో ఈ సినిమా షూటింగ్ ను నిలిపివేసినట్టుగా చెబుతున్నారు… ఇక ఇప్పటి వరకు బాగానే ఉన్నప్పటికి సినిమా కార్మికులకు సరిపడా వేతనం ఇస్తే వాళ్ల కుటుంబాలను ఆదుకున్నవారవుతారు…
కాబట్టి ఇప్పుడు తీసుకోబోయే నిర్ణయాలు చాలా కీలకంగా మారబోతున్నాయి…నిజానికి ఒక సినిమాను ప్రేక్షకులు చూస్తున్నారు అంటే దాని వెనకాల సినీ కార్మికుల శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది…
Also Read: కూలీ లో నా క్యారక్టర్ రజనీకాంత్ ని డామినేట్ చేస్తుంది – అక్కినేని నాగార్జున
ఇక వాళ్లకు సరిపడ అవసరాలను తీర్చుకోవడానికి సరైన వేతనం ఇచ్చి ప్రొడ్యూసర్స్ ఆదుకుంటే వాళ్ళు కూడా రెంటింపు ఉత్సాహంతో వర్క్ చేస్తారు…ఇక ఇండస్ట్రీ లో ప్రస్తుతం జరుగుతున్న ఈ చర్చల మీదనే సినిమా షూటింగ్స్ ఎప్పుడూ స్టార్ట్ అవుతాయి అనేది డిపెండ్ అయి ఉంటుంది…