Nagarjuna Coolie Movie: సౌత్ ఇండియా మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కూలీ'(Coolie Movie). లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) లాంటి స్టార్ డైరెక్టర్ రజనీకాంత్(Superstar Rajinikanth) తో సినిమా చేస్తున్నాడు అంటే సాధారణంగానే అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి, దానికి తోడు సౌత్ లో ఉన్న బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అందరినీ ఆ సినిమాలోకి తీసుకొని వచ్చాడు. ఇక అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా..?, కేవలం తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ 50 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయింది. ఇది సాధారణమైన విషయం కాదు. ఇకపోతే ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున విలన్ క్యారక్టర్ చేసిన సంగతి తెలిసిందే. కెరీర్ లో నెగటివ్ రోల్ లో ఆయన నటించడం ఇదే మొట్టమొదటిసారి. రీసెంట్ గానే చెన్నై లో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన, నేడు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో కూడా పాల్గొన్నాడు.
Also Read: అల్లు అర్జున్ నే అల్లాడించేశారు.. అదీ అమెరికాలో.. ఎవర్రా మీరంతా..
ఈ ప్రెస్ మీట్ లో నాగార్జున(Akkineni Nagarjuna) మాట్లాడిన మాటలు బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘శివ లాంటి కమర్షియల్ మూవీ చేసిన నన్ను, ఆరోజుల్లో అన్నమయ్య లాంటి సినిమా చేయడానికి ఒప్పుకున్నప్పుడు నన్ను ఆపేందుకు చాలా మంది ప్రయత్నాలు చేశారు. కానీ నేను ఆగలేదు, కొత్త రకమైన పాత్రలు చేయడానికి నేను ఎప్పుడూ ముందు ఉంటాను. అలా చేసుకుంటూ ఇన్నాళ్లు వచ్చాను, ఎదురు దెబ్బలు తగిలాయి, విజయాలు కూడా వచ్చాయి. ఇందాక రజనీకాంత్ న్గారు నా గురించి చాలా గొప్ప మాటలు చెప్పాడు. ఆయన చెప్పినట్టు గానే ప్రతీ సారీ పాజిటివ్ క్యారెక్టర్స్ చేసి విసుగొచ్చి మొట్టమొదటిసారి ఈ నెగిటివ్ క్యారక్టర్ కి ఒప్పుకున్నాను. లోకేష్ ఈ కథ చెప్పడానికి మా ఇంటికి వచ్చినప్పుడు, నేను రికార్డు చేసుకోవచ్చా అని అడిగి మరీ రికార్డు చేసుకున్నాను. ఇలా నేను నా కెరీర్ లో ఇప్పటి వరకు చేయలేదు’.
Also Read: సందీప్ రెడ్డి వంగ సినిమాను అల్లు అర్జున్ క్యాన్సిల్ చేసుకున్నాడా..? కారణం ఏంటి..?
‘ఆయన వెళ్లిపోయిన తర్వాత ఆ రికార్డుని ఒకటికి పది సార్లు, నాకు కాస్త ఇబ్బందిగా అనిపించినవి ఆయనకు చెప్పాను. ఆయన దేశం లోనే అగ్ర దర్శకుడు, నేను మార్పులు చెప్పినప్పుడు ఆయన అవసరం లేదని చెప్పి వేరే నటుడి ని తీసుకొని ఉండొచ్చు, కానీ అలా చెయ్యలేదు. ఆరు సార్లు నన్ను కలిసి న్యారేషన్ ఇచ్చాడు. కథ మొత్తం విన్న తర్వాత నేను రజనీకాంత్ గారు నిజంగా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారా అని అడిగాను. ఎందుకంటే నా క్యారక్టర్ చాలా డైనమిక్ గా ఉంటుంది. దాదాపుగా హీరో అన్నట్టుగానే ఉంటుంది. రజనీకాంత్ గారితో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతి. చాలా సింపుల్ గా ఉంటాడు ఆయన. ఇప్పటికీ కూడా ఆయన తన పాత్రకు సంబంధించిన డైలాగ్స్ ని ఒంటరిగా వెళ్లి రిహార్సల్స్ చేసుకుంటూ ఉంటాడు. క్లైమాక్స్ షూట్ అప్పుడు కూడా ఇంతే , ఒంటరిగా ఆయన రిహార్సల్స్ చేసుకొని, మాకు ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే వచ్చి చెప్తుండేవాడు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా ఆయన ఏమి మాట్లాడాడో ఈ క్రింది వీడియో లో చూడండి.