Prabhas in Coolie Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో రజినీకాంత్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నిజానికి ఆయన తమిళ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందినప్పటికి ఆయన సినిమాలను తెలుగులో డబ్ చేస్తూ తెలుగులో కూడా విశేషమైన ఆదరణను సంపాదించుకున్నాడు. ఇక్కడ రిలీజ్ చేస్తున్న సినిమాలన్నింటితో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రేక్షకులందరిని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశాడు… ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ప్రస్తుతం ఆయన లోకేష్ కనకరాజు దర్శకత్వంలో చేస్తున్న కూలీ (Cooli) సినిమా మరో పది రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలైతే వెలువడుతున్నాయి… కూలీ సినిమాని మొదట కమలహాసన్ తో చేయాలని అనుకున్నారట. కానీ కమలహాసన్ ఆ కథను రిజెక్ట్ చేయడంతో రజనీకాంత్ తో ఈ సినిమాను చేసి ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలని లోకేష్ కనకరాజు భావించారట. మొత్తానికైతే రజనీకాంత్ తో ఈ సినిమాని తెరకెక్కించిన ఆయన ఈ సినిమా మీద భారీ బజ్ ను క్రియేట్ చేయడంలో కూడా చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మరి ఈ సినిమా కోసం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు అంటే నిజంగా ఈ సినిమా ప్రేక్షకుల్లో ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనం అర్థం చేసుకోవచ్చు…
Also Read: సందీప్ రెడ్డి వంగ సినిమాను అల్లు అర్జున్ క్యాన్సిల్ చేసుకున్నాడా..? కారణం ఏంటి..?
అయితే ఇప్పటికే ఈ సినిమాలో చాలామంది నటులు నటిస్తున్నారు నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, అమీర్ ఖాన్ లాంటి నటులు ఉన్నప్పటికీ మరొక స్టార్ హీరో కూడా ఇందులో గెస్ట్ అప్పిరియన్స్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇంతకీ ఆ నటుడు ఎవరు అనే విషయంలో కొన్ని వార్తలు బయటికి వస్తున్నాయి.
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా చివర్లో ప్రభాస్ ఒక గెస్ట్ అప్పిరియన్స్ అయితే ఇస్తున్నారట. ఇప్పటివరకు ఈ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించని సినిమా యూనిట్ ఈ సినిమా ఎండింగ్ లో థ్రిల్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ప్రభాస్ ని ఎంటర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రభాస్ సైతం రజినీకాంత్ మీద ఉన్న ఇష్టంతో ఈ సినిమాలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట…
Also Read: అల్లు అర్జున్ నే అల్లాడించేశారు.. అదీ అమెరికాలో.. ఎవర్రా మీరంతా..
విక్రమ్ సినిమా చివర్లో రోలెక్స్ గా సూర్య వచ్చి ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాడో ఈ సినిమాలో ప్రభాస్ కూడా అలాంటి ఒక ఇంపాక్ట్ ను క్రియేట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది…మరి ప్రభాస్ గెస్ట్ అప్పిరియన్స్ ఇస్తున్నాడా? లేదంటే లోకేష్ యూనివర్స్ లో భాగం కాబోతున్నాడా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే…