Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి దిమ్మతిరిగే అప్డేట్... పవన్ ఫ్యాన్స్ సిద్ధంగా...

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ నుండి దిమ్మతిరిగే అప్డేట్… పవన్ ఫ్యాన్స్ సిద్ధంగా ఉండండి!

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ టీమ్ పవన్ ఫ్యాన్స్ కి భారీ సప్రైజ్ ఇచ్చారు. నేడు మూవీకి సంబంధించిన అప్డేట్ ఇస్తున్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఫ్యాన్స్ కి ట్రీట్ సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబోకి స్పెషల్ క్రేజ్ ఉంది. 2012లో విడుదలైన గబ్బర్ సింగ్ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. గబ్బర్ సింగ్ మూవీలో పవన్ కళ్యాణ్ క్యారెక్టరైజేషన్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చింది. హరీష్ శంకర్ రాసిన వన్ లైనర్స్ బాగా పేలాయి. ఒక్కో డైలాగ్ ఒక్కో ఆటం బాంబ్ అని చెప్పొచ్చు. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కాగా ఈ కాంబో కోసం చాలా కాలంగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

2019లో పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ ఇచ్చారు. వరుస చిత్రాలు ప్రకటించారు. వాటిలో హరీష్ శంకర్ తో ఓ మూవీ అనౌన్స్ చేశారు. మొదట్లో భవదీయుడు భగత్ సింగ్ అనుకున్నారు. ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ తెరపైకి తెచ్చారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి తాత్కాలికంగా బ్రేక్ పడింది. పవన్ కళ్యాణ్ రాజకీయంగా బిజీ అయ్యారు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఆయన పూర్తి సమయం అందుకు కేటాయిస్తున్నారు.

అయితే కొంత మేర ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరుపుకుంది. ఈ క్రమంలో గ్లింప్స్ సిద్ధం చేసినట్లు సమాచారం. మార్చి 19 మంగళవారం నాడు సాయంత్రం 4: 45 నిమిషాలకు సర్ప్రైజ్ అప్డేట్ అని నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. తక్కువ నిడివి కలిగిన ఓ ప్రోమో విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఈ అప్డేట్ పై దర్శకుడు హరీష్ శంకర్ సైతం స్పందించాడు. ‘డైలాగ్ ఉంది’ అని ఆయన కామెంట్ చేశాడు. పవన్ ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.

ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి జంటగా శ్రీలీల నటిస్తుంది. ఉస్తాద్ భగత్ సింగ్ తేరి రీమేక్ అని సమాచారం. అయితే మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. తేరి కథకు సమూల మార్పులు చేసి స్ట్రెయిట్ మూవీగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని తాజా అప్డేట్ మెస్మరైజ్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

RELATED ARTICLES

Most Popular