Naga Chaitanya Sensational Decision: నిర్మాత బావుంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటేనే హీరోలు పదికాలాల పాటు తమ హీరోయిజమ్ చూపించగలరు. సీనియర్ ఎన్టీఆర్, కృష్ణ ఈ మాటను బాగా నమ్మేవారు. అందుకే, చేసిన సినిమా నష్టాల్లో పడితే – మరో కోణంలో దాన్ని భర్తీ చేసుకునేందుకు అదే నిర్మాతతో మరో సినిమా చేసేవారు. టాలీవుడ్‌లో ఆనవాయితీగా వస్తున్న అండర్‌స్టాండింగ్ ప్రొఫెషనలిజం ఇది.కాకపోతే, పెరిగిన కమర్షియాలిటీ కారణంగా గత జనరేషన్ నుంచి ఈ పద్ధతిలో మార్పు వచ్చింది. ‘మా ఇంటికొస్తే ఏం తెస్తారు, మీ ఇంటికొస్తే ఏం పెడతారు’ అన్న మాదిరిగా తయారయ్యారు మన స్టార్ హీరోలు. ఒకరిద్దరు హీరోలు నిర్మాత బాగు కోసం ఆలోచించినా ఆనవాయితీ ప్రకారం మళ్లీ మరో సినిమా మాత్రం చేయడం లేదు. తానూ చేసే కొత్త సినిమాలో ఆ ప్లాప్ నిర్మాతకి ఓ ఏరియా థియేటర్ రైట్స్ ను ఇప్పిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో నిర్మాత దిల్ రాజు, హీరో నాగచైతన్య మధ్య పాత పద్దతి ప్రొఫెషనలిజం అండర్‌స్టాండింగ్ సెట్టయ్యింది. చైతు తాజా చిత్రం ‘థాంక్యూ’ విడుదలై భారీ నష్టాలను తీసుకొచ్చింది. మరో పక్క దిల్ రాజు వరుస ప్లాప్ లతో సంప్‌లో పడటం, పైగా చైతు కోసం భారీ బడ్జెక్ట్ పెట్టి ‘థాంక్యూ’ సినిమా తీయడం దిల్ రాజుకు అన్నీ విధాలుగా నష్టాలకు కారణం అయ్యింది.
అందుకే.. చైతు వచ్చే ఏడాది దిల్ రాజు బ్యానర్ లోనే మరో ప్రాజెక్టు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు నిర్మాతగా చైతు హీరోగా రాబోతున్న ఈ సినిమాని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించనున్నాడు. మొత్తానికి ‘థాంక్యూ’ సినిమా దిల్ రాజుకి భారీ నష్టాలను మిగిల్చింది. అందుకే.. చైతు, తక్కువ రెమ్యునరేషన్ తీసుకుని మరో సినిమా చేస్తున్నాడు.
నిర్మాత నష్టాలను భర్తీ చేయాలనే ఆలోచన ఈ జనరేషన్ హీరోల్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. పైగా తక్కువ పారితోషికం తీసుకుని సినిమా చేస్తానని ముందుకు రావడం నిజంగా గొప్ప విషయమే. ఫ్రెడ్షిప్ కొద్దీ చైతు చూపిస్తోన్న ప్రొఫెషనలిజానికి కచ్చితంగా ఈ అక్కినేని వారసుడిని ప్రశంసించాలి.