Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan with blood-stained hand : చేతినిండా రక్తం తో పవన్ కళ్యాణ్..ప్రకంపనలు రేపుతున్న...

Pawan Kalyan with blood-stained hand : చేతినిండా రక్తం తో పవన్ కళ్యాణ్..ప్రకంపనలు రేపుతున్న తాజా ట్వీట్!

Pawan Kalyan with blood-stained hand : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ అంచనాలు ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘ఓజీ'(They Call Him OG). సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కేవలం అభిమానులు మాత్రమే కాదు, టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆతృతగా ఎదురు చూస్తుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ గా ఉండడం వల్ల కొంత కాలం ఓజీ షూటింగ్ కి బ్రేక్ పడింది. గత నెల నుండి మళ్ళీ ఆయన తిరిగి షూటింగ్ ని ప్రారంభించాడు. హైదరాబాద్ లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం, ఆ తర్వాత ముంబై లో కొన్ని రోజులు షూటింగ్ జరుపుకుంది. ఇక ఆ తర్వాత అమరావతి కి తిరిగి వచ్చిన పవన్ కళ్యాణ్ రెండు రోజుల పాటు విరామం తీసుకొని మళ్ళీ ఓజీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. నేడు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అర్జున్ దాస్ కాసేపటి క్రితమే వేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది.

ఓజీ మూవీ షూటింగ్ సెట్స్ లో పవన్ కళ్యాణ్ తో తీసుకున్న సెల్ఫీ లను అప్లోడ్ చేస్తూ ‘మీతో కలిసి పని చేయడం నాకు ఒక అదృష్టం లాంటిది కళ్యాణ్ గారు. మీతో పని చేసిన ప్రతీ రోజుని, ప్రతీ క్షణాన్ని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను, షూటింగ్ గ్యాప్ లో మీ విలువైన సమయాన్ని నాకు కేటాయించి కాసేపు నాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు. మీకున్న బిజీ షెడ్యూల్ లో కూడా నాకు సమయాన్ని కేటాయించడం అదృష్టం గా భావిస్తున్నాను. మీతో జరిపిన విలువైన సంభాషణని ఎప్పటికీ మర్చిపోలేను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫోటోలు సంచలనంగా మారాయి. ఈ ఫోటోలలో పవన్ కళ్యాణ్ చేతికి రక్తపు మరకలు ఉండడాన్ని గమనించిన అభిమానులు పూనకలొచ్చి ఊగిపోతున్నారు. ఇలా కదా మేము పవన్ కళ్యాణ్ ని చూడాలని ఆశపడింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సినిమా లో దీనిని బట్టి వయొలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ని ఎవ్వరూ చూడని విధంగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ సుజీత్. ఈ నెల 10 వరకు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి కానుంది. ఆ తర్వాత విజయవాడ లోనే ఈ నెల 16 వరకు ఇతర తారాగణంతో ప్లాన్ చేసిన షూటింగ్ ని జరుపుతారు. దాంతో మూవీ షూటింగ్ మొత్తం పూర్తి అయ్యినట్టే. అయితే ఇమ్రాన్ హష్మీ తో ముంబై లో ఒక సన్నివేశం బ్యాలన్స్ ఉంది. మొన్న జరిగిన ముంబై షెడ్యూల్ లోనే ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాల్సి ఉంది కానీ, ఇమ్రాన్ హష్మీ కి డెంగ్యూ ఫీవర్ రావడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. ఈ నెలాఖరున నుండి మూడు రోజుల పాటు ఇమ్రాన్ హష్మీ, పవన్ కళ్యాణ్ లపై ఒక భారీ ఫైట్ సీన్ ని చిత్రీకరించనున్నారు. అక్కడితో ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టేసినట్టు లెక్క.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper