Who brought IT to Hyderabad : హైదరాబాద్ నగరం నేడు దేశంలోనే టాప్ 10 సిటీస్ లో ఒకటిగా కొనసాగుతుంది. 20 ఏళ్ళ క్రితం హైదరాబాద్ ని, ప్రస్తుత హైదరాబాద్ ని చూస్తే ఇంత సమూలమైన మార్పు ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోక తప్పదు. హైదరాబాద్ నగరం ఇంత అభివృద్ధి చెందడానికి ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు అని అందరూ అంటూ ఉంటారు. హైదరాబాద్ ని ఐటీ హబ్ గా మార్చాలి అనే ఆయన తపన నిజమే, ఆ విధంగా కృషి చేసి అడుగులు వేసిన విషయం కూడా నిజమే. కానీ చంద్రబాబు ఆకాంక్ష ని నెరవేర్చింది మాత్రం ప్రస్తుత రాజకీయాల్లో కమెడియన్ గా పిలవబడుతున్న KA పాల్. అవును మీరు వింటున్నది నిజమే. KA పాల్ సాహసహకారాలు లేకుంటే హైదరాబాద్ కి IT అంత తేలికగా వచ్చేది కాదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదేదో కామెడీ గా చెప్తున్న మాట కాదు, అందుకు వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి.
అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బిన్ క్లింటన్ ని మన దేశానికీ, అదే విధంగా మన రాష్ట్రానికి తీసుకొని రావడం లో KA పాల్ చేసిన కృషి సాధారణమైనది కాదు. అందుకు సంబంధించిన వీడియో ని మీరు క్రింద చూడొచ్చు. బిన్ క్లింటన్ ఆంధ్ర ప్రదేశ్ కి వచ్చిన తర్వాతే హైదరాబాద్ లో IT కంపెనీలకు బీజం పడింది. ఇక్కడ మనకి భవిష్యత్తు ఉంటుంది అని అర్థం చేసుకున్న ఐటీ కంపెనీలు వరుసగా ఒక్కొక్కటి హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు రావడం, అలా నగరం మొత్తం అభివృద్ధి చెందడం జరిగింది. హైదరాబాద్ అంటే ఎంతసేపు చంద్రబాబు పేరు ని మాత్రమే చెప్తారు కానీ, దాని వెనుక కృషి చేసిన KA పాల్ పేరు ని మాత్రం ఎవ్వరూ చెప్పరు. ఆయన ఏమి మాట్లాడినా కామెడీ గానే చూస్తారు. కానీ చరిత్ర పుట్టలు తవ్వితే KA పాల్ ని చూసి ఎవరైనా వానకాల్సిందే.
ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రముఖులంతా ఆయన భక్తులు. అలాంటి వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడు తన సొంత అల్లుడి రాజకీయ జీవితం కోసం KA పాల్ మీద లేని పోనీ కేసులు బనాయించి, అతన్ని పిచోడిగా ముద్రించి జనాల్లోకి వదిలారు. నేడు పాల్ ఏమి చెప్పినా నమ్మే పరిస్థితి లో లేరు. ఆయన చెప్పేవి నూటికి నూరు శాతం నిజం కాకపోవచ్చు కానీ , అత్యధిక శాతం నిజాలు మాత్రమే ఉంటాయి.