https://oktelugu.com/

Pawan Kalyan : షారుఖ్ ఖాన్ ని పోలీసులకు పట్టించిన పవన్ కళ్యాణ్..సోషల్ మీడియా లో ట్రెండింగ్ అవుతున్న వీడియో!

గత ఏడాది ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో అక్రమంగా 'స్టెల్లా' అనే బోట్ లో వేల టన్నుల రేషన్ రైస్ తరలిస్తున్న విషయాన్ని తెలుసుకొని, సముద్రం లోకి 9 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయిన స్టెల్లా బొట్టుని ఛేజ్ చేసి మరీ పట్టుకొని సీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 03:56 PM IST

    Pawan Kalyan ,Shah Rukh Khan

    Follow us on

    Pawan Kalyan : గత ఏడాది ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో అక్రమంగా ‘స్టెల్లా’ అనే బోట్ లో వేల టన్నుల రేషన్ రైస్ తరలిస్తున్న విషయాన్ని తెలుసుకొని, సముద్రం లోకి 9 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయిన స్టెల్లా బొట్టుని ఛేజ్ చేసి మరీ పట్టుకొని సీజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమయంలో ఆయన ‘సీజ్ ది షిప్’ అని చెప్పిన డైలాగ్ దేశం మొత్తం వ్యాప్తి చెందింది. ఇప్పటికీ ఆ పదం ట్రెండింగ్ లోనే ఉంది. సినిమాల్లో మాత్రమే ఇలాంటి సందర్భాలను ఇది వరకు మనం చూసి ఉంటాము. మొట్టమొదటిసారి నిజ జీవితం లో పవన్ కళ్యాణ్ ద్వారా చూసాము. ఆ ధైర్యసాహసాలకు దేశం మొత్తం మెచ్చింది. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు రాష్ట్రానికి ఒక్కడుంటే చాలు, దేశం అభివృద్ధి విషయంలో అమెరికా ని కూడా దాటేస్తుందని ప్రశంసల వర్షం కురిపించారు.

    అయితే ఈ సీజ్ ది షిప్ డైలాగ్ ని ఉపయోగించుకుంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కొన్ని ఫన్నీ ఎడిటింగ్ వీడియోస్ ని చేసారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వీడియోలే కనిపిస్తున్నాయి. రీసెంట్ గా షారుఖ్ ఖాన్ సినిమాలోని ఒక సన్నివేశాన్ని తీసుకొని ‘సీజ్ ది షిప్’ వీడియో కి క్రాస్ ఓవర్ చేస్తూ ఎడిట్ చేసిన ఒక వీడియో కి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో లో షారుఖ్ ఖాన్ ఒక షిప్ లో ప్రయాణిస్తూ ఉంటాడు. ఆ షిప్ కొంతమంది దుండగులు స్మగ్లింగ్ చేస్తున్న విషయాన్ని గమనిస్తాడు. దూరంగా పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఒక బోట్ లో రావడాన్ని గమనించిన షారుఖ్ ఖాన్, వాళ్ళని ఇక్కడికి రావాల్సిందిగా పిలుస్తాడు. అరెస్ట్ చేసి తీసుకెళ్లండి సార్ వీళ్ళని అని షారుఖ్ ఖాన్ అంటే, దానికి పవన్ కళ్యాణ్ స్మగ్లింగ్ చేస్తున్న వాళ్ళతో షారుఖ్ ఖాన్ ని కూడా కలిపి అరెస్ట్ చేసి తీసుకెళ్తాడు.

    ఈ వీడియో ఎడిట్ అభిమానులను పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వించింది. ఇదేమి టాలెంట్ బాబోయ్, ఇంత టాలెంట్ పెట్టుకొని ఇంకా ఇక్కడేం చేస్తున్నావ్ సినిమాల్లోకి వెళ్లకుండా అని ఆ వీడియో ని ఎడిట్ చేసిన వ్యక్తిని ప్రశంసిస్తున్నారు. ఇలాంటి ఫన్నీ వీడియోలు సీజ్ ది షిప్ సంఘటన ని ఉపయోగించి చాలానే వచ్చాయి. అన్నిటికి బీభత్సమైన వ్యూస్ రావడం విశేషం. కేవలం టాలీవుడ్ ఆడియన్స్ మాత్రమే కాకుండా, నార్త్ ఇండియన్స్ కూడా ఈ ఎడిటింగ్ వీడియోస్ ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరించడమే కాకుండా, ఆయన ఒప్పుకున్న సినిమాలను కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆయన నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఈ ఏడాది మార్చి 28 న విడుదల కాబోతుంది.