Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ పై అటు అభిమానుల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీ స్థాయిలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ రేపటి నుండి ప్రారంభం కానుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న థియేట్రికల్ ట్రైలర్ కూడా రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతుంది. ఈ ట్రైలర్ ని బట్టే సినిమా రేంజ్ ఏంటి?, మొదటి రోజు ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పుతుందా లేదా అనేది తేలనుంది. ఇప్పటికి అయితే నార్త్ అమెరికా లో ట్రైలర్ అవసరం లేకుండా నాలుగు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ట్రైలర్ తర్వాత గ్రాస్ వసూళ్లు అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుండి మొదలు కాబోతున్నాయో ఒక క్లారిటీ వచ్చేసింది.
అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆదివారం నుండి తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ముందుగా బెన్ఫిట్ షోస్ కి సంబంధించిన బుకింగ్స్ అన్ని ప్రాంతాల్లో 600 రూపాయిల టికెట్ రేట్స్ తో మొదలు పెట్టబోతున్నారట. అర్థ రాత్రి 1 గంట నుండి ఈ షోస్ ప్రారంభం కాబోతున్నాయి. అభిమానులు ఈ షోస్ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆరేళ్ళ తర్వాత రామ్ చరణ్ నుండి వస్తున్నా సోలో హీరో చిత్రమిది. ఇది ఇలా ఉండగా రెగ్యులర్ షోస్ అడ్వాన్స్ బుకింగ్స్ సింగల్ స్క్రీన్స్ కి 280 రూపాయిలు, మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ కి 350 రూపాయిల టికెట్ రేట్స్ ఉండనున్నాయి. రేపు, లేదా ఎల్లుండి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుండి అనుమతి తో కూడిన జీవో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరి తెలంగాణ లో ఈ చిత్రానికి బెనిఫిట్ షోస్, టికెట్ హైక్స్ వస్తాయా లేదా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. ఎందుకంటే రీసెంట్ గానే ఆ రాష్ట్ర ముఖ్య రేవంత్ రెడ్డి, నేను సీఎం గా ఉన్నన్ని రోజులు తెలంగాణ లో సినిమాలకు బెనిఫిట్ షోస్, టికెట్ హైక్స్ ఉండవు అంటూ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే దిల్ రాజు ప్రభుత్వం తరుపున ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి, ‘గేమ్ చేంజర్’ కి మాత్రం టికెట్ హైక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ బెనిఫిట్ షోస్ వస్తాయా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అందుతున్న సమాచారం ప్రకారం 99 శాతం బెనిఫిట్ షోస్ కి అనుమతిని ఇచ్చే పరిస్థితులు లేవట. బెనిఫిట్ షోస్ కి బదులుగా తెల్లవారు జామున నాలుగు గంటల షోస్ కి అనుమతిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయట. చూడాలి మరి ఏమి జరగబోతుందో.