Pawan Kalyan Ustaad Bhagat Singh remuneration: మరో 12 రోజుల్లో పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘(Ustaad Bhagat Singh) చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ యునైటెడ్ కింగ్డమ్ దేశం లో మొదలు పెట్టారు. రేపటి నుండి ఓవర్సీస్ మొత్తం అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. కేవలం USA లోనే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 375 షోస్ షెడ్యూల్ చేసి ఉన్నాయి , అందులో 45 కి పైగానే XD షోస్ ఉండడం గమనార్హం . ఆరంభం లోనే లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు . ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తి కరమైన విషయం తెలిసింది.
అదేమిటంటే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 30 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకున్నాడట. 2017 వ సంవత్సరం లో మైత్రీ మూవీ మేకర్స్ నుండి 5 కోట్ల రూపాయిల అడ్వాన్స్ తీసుకున్న పవన్ కళ్యాణ్ , ఈ సినిమా షూటింగ్ పూర్తి అయ్యే సమయానికి మరో పాతిక కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్నాడు. రీసెంట్ గానే నిర్మాతలు మిగిలిన డబ్బులు ఇవ్వడానికి పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్తే , ఈ సినిమా నా వల్లే చాలా కాల ఆగిపోయింది. మీరు ఎంతో నష్టాలను అనుభవించి ఉంటారు. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన రెమ్యూనరేషన్ చాలు, సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యాక లాభాలు వస్తే అందులో కొంత వాటాలు ఇవ్వండి , లేదంటే వద్దు అని చెప్పాడట. ఇలా చేయడం వల్ల నిర్మాతకు చాలా లాభం చేకూరింది. ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన నెట్ ఫ్లిక్స్ రైట్స్ ఏకంగా 82 కోట్లకు అమ్ముడుపోయింది.
అంటే వాళ్ళు డబ్బులు ఇప్పుడే ఇవ్వరు, సినిమా విడుదలై సూపర్ హిట్ అయితేనే ఇస్తారు. హిట్ అయ్యి భారీ గ్రాస్ ని నమోదు చేసుకుంటే 82 కోట్లు , లేదంటే 41 కోట్ల రూపాయిలు మాత్రమే ఇస్తారట. అదే విధంగా థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి 140 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని సమాచారం. వాటిల్లో కొన్ని ప్రాంతాలు అడ్వాన్స్ బేసిస్ మీద జరిగినవి ఉన్నాయి. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తే భారీ లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాటిల్లో పవన్ కళ్యాణ్ కి వాటాలు ఉంటాయట. చిన్న చిన్న హీరోలే ఒక్కో సినిమాకు 20 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ రోజుల్లో నిర్మాత బాగు కోరి , తానూ చేసిన నష్టాలను పూడుస్తూ పవన్ కళ్యాణ్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కేవలం 30 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ తో సరిపెట్టుకోవడం నిజంగా స్వాగతించదగ్గ నిర్ణయం.