Homeఎంటర్టైన్మెంట్Vijay Trisha marriage date: తమిళ హీరో విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్..పూర్తి వివరాలు...

Vijay Trisha marriage date: తమిళ హీరో విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్..పూర్తి వివరాలు ఎక్సక్లూసివ్ గా మీకోసం!

Vijay Trisha marriage date: తమిళనాడు సినీ , రాజకీయ వర్గాల్లో హీరో విజయ్(Thalapathy Vijay) విడాకుల వ్యవహారం ఎంత పెద్ద సెన్సేషనల్ టాపిక్ అయ్యిందో గత వారం రోజుల నుండి మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ విషయం లో రోజురోజుకి ఎదురు అవుతున్న ట్విస్టులు వేరే లెవెల్ లో ఉన్నాయి. విజయ్ సతీమణి సంగీత విడాకుల పిటీషన్ లో చేసిన ఆరోపణలను నిజం చేస్తూ, రీసెంట్ గానే విజయ్ ఒక పెళ్లి ఫంక్షన్ కి ప్రముఖ హీరోయిన్ త్రిష తో కలిసి రావడం పెద్ద సెన్సేషనల్ టాపిక్ గా మారింది. సొంత అభిమానులే ఆయన్ని ఈ విషయంలో తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ప్రస్తుతం తానూ త్రిష తో డేటింగ్ లో ఉన్నాను అనే విషయాన్నీ విజయ్ ఈ సంఘటన ద్వారా చెప్పకనే చెప్పేశాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న మరో వార్త సంచలనంగా మారింది.

అదేంటంటే వీళ్లిద్దరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారట. అది ఎన్నికలకు ముందు చేసుకోవాలా ?, లేదా ఎన్నికల తర్వాత చేసుకోవాలా అనేది ఆలోచిస్తున్నారట. ప్రస్తుతం తన భార్య సంగీత తో విడాకుల వ్యవహారం పై కోర్టు లో కేసు నడుస్తుంది. కోర్టు నుండి తుది తీర్పు వెలువడే వరకు పెళ్లి చేసుకోవడానికి లేదు. ఒకవేళ చేసుకుంటే చట్ట రీత్యా నేరం. అందుకే తీర్పు వచ్చే వరకు ఎదురు చూస్తారని తెలుస్తోంది. మరోపక్క విజయ్ కోర్టు వరకు వెళ్లకుండా, మాటలతోనే తన భార్య తో విడిపోయేందుకు చర్చలు జరిపాడని, ఆమెకు 250 కోట్ల రూపాయిల భరణం కూడా ఇచ్చినట్టు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి. అయితే నేడు ఆమె కోర్టు లో ఈ కేసు నడిచే వరకు తనని విజయ్ ఇంట్లో ఉండనివ్వాలని పిటీషన్ వేసింది. ఒకవేళ వీళ్లిద్దరి మధ్య కోర్టు వరకు వెళ్ళకూడదు అనే డీల్ జరిగి ఉండుంటే, సంగీత ఈ పిటీషన్ ఎందుకు వేస్తుంది ? అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

విజయ్ చర్చల కోసం సంప్రదించిన విషయం వాస్తవమే అయ్యుండొచ్చు, కానీ భరణం ఇచ్చేసాడు అనే వార్తలో ఎలాంటి నిజం లేదని కొందరు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. విజయ్ మాత్రం ఎన్నికలకు ముందే త్రిష ని అధికారికంగా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యినట్టు తెలుస్తోంది. మరి పరిస్థితులు అందుకు అనుకూలిస్తాయా ?, ఇలా చేయడం వల్ల ఆయన రాజకీయ భవిష్యత్తుకి ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనేది ఇప్పుడు ఆసక్తిని రేపుతున్న అంశాలు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular