Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan advice to Jr NTR: పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లే జూనియర్ ఎన్టీఆర్...

Pawan Kalyan advice to Jr NTR: పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లే జూనియర్ ఎన్టీఆర్ కి సూపర్ హిట్ వచ్చిందా..? ఇంతకి ఏ సినిమా?

Pawan Kalyan advice to Jr NTR: ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయా హీరోలు తీసుకున్న నిర్ణయాల మీదనే వాళ్ళ కెరియర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక సక్సెస్ ఫుల్ సినిమాను మిస్ చేసుకుంటే తన మార్కెట్ భారీగా కోల్పోవచ్చు. అలాగే ఒక మూవీతో విజయాన్ని సాధించిన హీరో తన మార్కెట్ ను బాగా పెంచుకునే […]

Pawan Kalyan advice to Jr NTR: ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమాని మరొక హీరో చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయా హీరోలు తీసుకున్న నిర్ణయాల మీదనే వాళ్ళ కెరియర్ అనేది ఆధారపడి ఉంటుంది. ఇక సక్సెస్ ఫుల్ సినిమాను మిస్ చేసుకుంటే తన మార్కెట్ భారీగా కోల్పోవచ్చు. అలాగే ఒక మూవీతో విజయాన్ని సాధించిన హీరో తన మార్కెట్ ను బాగా పెంచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎన్నో సినిమాలను వదులుకున్నాడు. ఇక ఇలాంటి నేపథ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాని సైతం మొదట పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘కోబలి’ అనే పేరుతో స్టార్ట్ చేశారు. కానీ ఆ సినిమా ఒక షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఆగిపోయింది.

ఇక దాంతో అందులో కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్న త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమా చేయాలని మరోసారి సిద్ధమైనప్పటికి పవన్ కళ్యాణ్ మాత్రం అప్పుడు ఎలక్షన్స్ బిజీలో ఉండటం వల్ల ఈ సినిమాను నేను చేయలేను జూనియర్ ఎన్టీఆర్ తో చేయండి బాగా వర్కౌట్ అవుతుందని చెప్పారట. దాంతో జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ ఈ సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు.

మొత్తానికైతే ఎన్టీఆర్ కెరియర్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమాను ఒక సూపర్ హిట్ సినిమాగా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ వల్లే ఆయనకు అంత పెద్ద సక్సెస్ వచ్చింది. లేకపోతే త్రివిక్రమ్ వేరే హీరోతో ఆ సినిమాను చేసేవాడు ఏది ఏమైనా కూడా ఇండస్ట్రీ లో సక్సెస్ అనేది చాలా కీలకం…

సక్సెస్ ఫుల్ హీరోలకు మాత్రమే ఇక్కడ ఎక్కువ అవకాశాలు వస్తాయి…వాళ్ళు మాత్రమే స్టార్ హీరోలుగా మారడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది…ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈనెల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper