https://oktelugu.com/

Pawan Kalyan OG Story: ఓజీ టోటల్ స్టోరీ లీక్… కెజిఎఫ్ అమ్మా మొగుడయ్యా!

సినిమాలకు రేటింగ్స్ ఇచ్చే IMDB వెబ్ సైట్ లో ఓజీ స్టోరీ ఇదే అంటూ పోస్ట్ చేశారు. ‘ఓజాస్‌ గంభీర అనే ఓ టూరిస్ట్‌ బాయ్‌ అనుకోకుండా బాంబేకు వచ్చి అక్కడ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు.

Written By: , Updated On : September 7, 2023 / 12:27 PM IST
Pawan Kalyan OG Story

Pawan Kalyan OG Story

Follow us on

Pawan Kalyan OG Story: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఎలా చూడాలి అనుకుంటారో దానికి తగ్గట్లే తెరకెక్కుతుంది ఓజీ సినిమా. సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యొక్క టీజర్ గత వారం విడుదలై ప్రకంపనలు సృష్టించింది. గత కొంత కాలంగా పవన్ కళ్యాణ్ నుంచి దాదాపు గా రీమేక్ సినిమాలు వస్తున్నాయి. ఒక దశలో ఫ్యాన్స్ కూడా రీమేక్ లు వద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని డైరెక్ట్ ఫిల్మ్ చేయడానికి సిద్దమై సుజిత్ తెచ్చిన మాఫియా బ్యాక్ డ్రాప్ స్టోరీ ని ఫైనల్ చేశారు. కేవలం టీజర్ తో సినిమాపై అంచనాలు భారీగా పెంచారు దర్శకుడు. ఈ సినిమా ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది మొదటి లో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఓజీ ఎప్పుడు విడుదలైన కానీ బాక్స్ ఆఫీస్ షేక్ కావడం ఖాయం. ఈ సినిమా మాఫియా బ్యాక్ డ్రాప్ అని అందరికి తెలిసిందే, అయితే తాజాగా ఒక వెబ్సైటు లో ఈ సినిమా స్టోరీ ఇదే అంటూ ఒక స్టోరీ లైన్ కనిపిస్తుంది.

సినిమాలకు రేటింగ్స్ ఇచ్చే IMDB వెబ్ సైట్ లో ఓజీ స్టోరీ ఇదే అంటూ పోస్ట్ చేశారు. ‘ఓజాస్‌ గంభీర అనే ఓ టూరిస్ట్‌ బాయ్‌ అనుకోకుండా బాంబేకు వచ్చి అక్కడ గ్యాంగ్‌స్టర్‌గా మారతాడు. క్రైమ్, మాఫియాలలో రారాజుగా ఎదుగుతాడు. ఆ ప్రయాణంలో తన ఫ్యామిలీని పోగొట్టుకుంటాడు. దీంతో తన ఫ్యామిలీని అంతమొందించిన వారిని చంపడానికి నడుం బిగిస్తాడు. కేవలం చంపడమే కాకుండా ఆ విలన్‌ల సమ్రాజ్యాన్ని కుప్పకూలుస్తాడు. వాళ్లు చేసే ఇల్లీగల్‌ దందాలన్నిటిని కూకటి వేల్లతో పెకలించేస్తాడు’ అంటూ ప్రముఖ పాపులర్ సినిమా వెబ్‌ సైట్‌ ‘IMDB’ రాసుకొచ్చింది.

ఎలాంటి స్టోరీ బేస్ చేసుకొని ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. కాకపోతే పవన్ కళ్యాణ్ కి ఆయన ఫ్యాన్స్ కి ఈ జోనర్ ఫస్ట్ టైం. ఇక్కడ ఇంకో విషయం సుజిత్ సినిమా స్టోరీ లు నార్మల్ గానే ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే తో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్ళ సత్తా అతనికి ఉంది. పైగా IMDB లో కనిపిస్తున్న స్టోరీ లైన్ ఎక్కువ మంది అభిప్రాయాలు తీసుకుని రాస్తారు తప్పితే, అదే ఫైనల్ స్టోరీ అని అనుకోవడానికి లేదు.