Jabardasth Rohini: ప్రేమలో పడ్డ జబర్దస్త్ రోహిణి… ఆ లక్కీ ఫెలో ఎవరో తెలుసా?

ఈ వారం మరో స్పెషల్ ఏమిటంటే అటు జబర్దస్త్ తోను ఇటు సినిమాలతోను తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రోహిణి మొదటిసారి తన లవర్ ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతుంది.

Written By: Shiva, Updated On : September 7, 2023 12:20 pm

Jabardasth Rohini

Follow us on

Jabardasth Rohini: ప్రస్తుతం ఈటీవీ లో మంచి రేటింగ్ వస్తున్నా షో ఏమైనా ఉందా అంటే అది ఖచ్చితంగా శ్రీదేవి డ్రామా కంపెనీ అనే చెప్పాలి. ప్రతి ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఈ షో కి మంచి TRP రేటింగ్స్ వస్తున్నాయి. అటు ఫ్యామిలీ ఆడియన్స్ ను, ఇటు యూత్ ను ఎంటర్టైన్మెంట్ చేస్తూ సాగుతుంది శ్రీదేవి డ్రామా కంపెనీ షో. బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా అనే తేడా లేకుండా అందరిని ఇన్వాల్ చేయటం ఈ షో స్పెషాలిటీ

ఇక ఈ ఆదివారం కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి సిద్ధమైంది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఆది షాపింగ్ మాల్ అనే కాన్సెప్ట్ తో ఈ వారం రకరకాల గేమ్ షోస్ మరియు డాన్స్ పర్ఫామెన్స్ తో ఒక రేంజ్ లో ఉండబోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయ్యింది. పంచె కట్టులో ఆది చేసే సందడి మరో రేంజ్ లో ఉంటుంది. మరోపక్క సోషల్ మీడియా స్టార్స్ తో కూడా పాపులర్ రీల్స్ చేపిస్తూ షో ని రక్తికట్టించింది యాంకర్ రష్మీ .

ఈ వారం మరో స్పెషల్ ఏమిటంటే అటు జబర్దస్త్ తోను ఇటు సినిమాలతోను తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రోహిణి మొదటిసారి తన లవర్ ను ప్రేక్షకులకు పరిచయం చేయబోతుంది. ఈ షో లో రోహిణి మాట్లాడుతూ నన్ను అంటూ సీరియస్ గా తీసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం అంటూ ” ఏమైయిందో ఏమో నా మదిలో ఈ వేళ ” అనే సాంగ్ పాడింది. ఇదే సమయంలో స్టేజ్ మీదకు ఆమె లవర్ ఎంట్రీ ఇచ్చినట్లు చూపిస్తూ ప్రోమో కట్ చేశారు.

దీంతో రోహిణి లవర్ ఎవరై ఉంటారు అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. అతను ఎవరో తెలుసుకోవాలంటే ఈ ఆదివారం దాకా ఆగాల్సిందే. ప్రస్తుతం అనేక సినిమాల్లో అలాగే బుల్లితెర మీద నటిస్తూ కెరీర్ లో దూసుకెళ్తుంది. రీసెంట్ గా “సేవ్ ది టైగర్” వెబ్ సిరీస్ లో నటించిన రోహిణి కి మంచి మార్కులే వచ్చాయి. నిజానికి తెలుగు లో లేడి కమెడియన్ అంటూ ప్రస్తుతం ఎవరు లేరు. కోవై సరళ తర్వాత ఆ రేంజ్ కు వెళ్లిన నటి ఎవరు లేరు. రోహిణి మాత్రమే ఇదే విధంగా కెరీర్ ప్లాన్ చేసుకుంటే మంచి స్థాయికి వెళ్లే అవకాశం లేకపోలేదు.