Pawan Kalyan Michael Jackson Dance: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) అభిమానులు తమ అభిమాన హీరోకి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎంతలా సంబరాలు చేసుకుంటారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాసేపటి క్రితమే విడుదలైన ‘#TheAuraOfUstaad’ ప్రోమో సాంగ్ కి ఫ్యాన్స్ సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో సంబరాలు చేసుకుంటున్నారు. ప్రోమో లో లిరిక్స్ లేకపోయినప్పటికీ, మ్యూజిక్ బీట్ బాగా ఉండడం తో సోషల్ మీడియా లో ఆ వీడియో ని తెగ తిప్పేస్తున్నారు. ఈ ప్రోమో సంగతి పక్కన పెడితే, ఒక అభిమాని పవన్ కళ్యాణ్, మైఖేల్ జాక్సన్ లను కలుపుతూ చేసిన ఒక ఎడిటింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. నేడు విడుదల చేసిన ప్రోమో కంటే కూడా, ఈ ఏడిటెడ్ వీడియో కి పవన్ ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడం గమనార్హం.
‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) చిత్రం లోని మొదటి పాట ‘దేఖ్లేంగే సాలా’ లో పవన్ కళ్యాణ్ వేసిన స్టెప్పులను మీరంతా చూసే ఉంటారు. సింపుల్ స్టెప్స్ అయినప్పటికీ చాలా గ్రేస్ తో, చూసేందుకు ఎంతో అందంగా అనిపించేలా స్టెప్పులు వేసాడు. పవన్ నుండి ఈ రేంజ్ డ్యాన్స్ స్టెప్పులు అభిమానులు, ప్రేక్షకులు అసలు ఊహించలేదు. అయితే ఈ స్టెప్పులు మైఖేల్ జాక్సన్ పాత పాటల్లోని స్టెప్పులని ఈ ఎడిటింగ్ వీడియో ని చూసిన తర్వాతే అందరికీ తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మైఖేల్ జాక్సన్ బయోపిక్ పై ‘మైఖేల్’ అనే చిత్రం తెరకెక్కింది. ఏప్రిల్ 24 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం లోని మొదటి పాట ని విడుదల చేశారు మేకర్స్. ఈ పాటలో మైఖేల్ జాక్సన్ వేసిన స్టెప్పులు కొన్ని, ఉస్తాద్ భగత్ సింగ్ లోని పవన్ కళ్యాణ్ స్టెప్పులకు జత చేస్తూ ఒక ఎడిట్ చేయగా, అది అభిమానులకు తెగ నచ్చేసింది.
సోషల్ మీడియా లో ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ వీడియో నే కనిపిస్తోంది. ఇంత పర్ఫెక్ట్ సింక్ తో ఈమధ్య కాలం లో ఒక్క ఎడిట్ ని కూడా చూడలేదని, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మంచి క్రియేటర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా ని ఊపేస్తున్న ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇకపోతే ఉస్తాద్ భగత్ సింగ్ నుండి రెండవ పాట ‘#TheAuraOfUstaad’ ని ఈ నెల 22 న విడుదల చేయబోతున్నారు మేకర్స్. ఈ సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన కంటెంట్స్ లో ఇది ది బెస్ట్ గా ఉండబోతుందని అంటున్నారు మేకర్స్.
Dekhlenge Saalaaa pic.twitter.com/xswkZ2nXVm
— Beat it (@NeManishiniKane) February 18, 2026