Pawan Kalyan Samurai Video: గత రెండు మూడు రోజుల నుండి తన అభిమానులను అయోమయం లోకి నెట్టేశాడు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan). పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ని మళ్లీ రీ యాక్టీవ్ చేసాడు. ఈ సంస్థ పై గతం లో ఆయన కొన్ని సినిమాలను నిర్మించాడు, మళ్లీ సినిమాలనే నిర్మిస్తాడు అని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ కేవలం సినిమాలు మాత్రమే కాదు, అంతకు మించిన కార్యక్రమాలు కూడా ఈ సంస్థ ద్వారా ప్లాన్ చేయబోతున్నట్టు అభిమానులకు ఒక హింట్ ఇచ్చాడు పవర్ స్టార్. తనకు ఎంతో ఇష్టమైన ‘మార్షల్ ఆర్ట్స్’ లో సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నట్టు చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ ప్రయాణం ఏమిటి?, పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ని స్థాపించబోతున్నాడా?, లేదా ‘ఓజీ 2’ కోసం అయన మార్షల్ ఆర్ట్స్ లో ఏదైనా కొత్త ఫామ్ నేర్చుకుంటున్నాడా?, అసలు ఏమి చేయబోతున్నాడు? అనేది అర్థం కాక అభిమానులు గత రెండు రోజులు గా జుట్టు పీక్కుంటున్నారు.
ఇక కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుండి ఒక వీడియో విడుదలైంది. ఈ వీడియో లో పవన్ కళ్యాణ్ ‘కరాటే టు సమురాయ్’ గా మారినట్టు చెప్పుకొచ్చాడు. వీడియో చివర్లో ఆయన సమురాయ్ గెటప్ లో కనిపించడం అభిమానులను థ్రిల్ కి గురి చేసింది. ఇప్పటికీ ఈ అంశం పై పూర్తి స్థాయిలో ఎలాంటి క్లారిటీ రాలేదు కానీ, ఆయన ఎదో పెద్ద ప్లానింగ్ మీదనే ఉన్నాడు అనే విషయం తెలుస్తోంది. ఇన్ని రోజులు డిప్ప కటింగ్ తో, పొడవాటి గెడ్డం తో కనిపించిన పవన్ కళ్యాణ్ ని చూసి, ఎదో సరదాగా ఈ గెటప్ ని మైంటైన్ చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఎదో పెద్ద ప్లాన్ తోనే ఉన్నాడని ఇప్పుడు తెలుస్తోంది. మరి ఏమి చేయబోతున్నాడు అనేది తెలియాలంటే జనవరి 11 వరకు ఆగాల్సిందే.
ఇదంతా చూసిన ఫ్యాన్స్ ‘అన్నా నీపై ఓజీ మూవీ ప్రభావం చాలా గట్టిగానే పడింది’ అంటూ చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఓజీ చిత్రం లో పవన్ కళ్యాణ్ ‘సమురాయ్’ గా కనిపిస్తాడు. జపాన్ లో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యాకూజాలు, సమురాయ్ లను అంతం చేయడం మొదలు పెడుతారు. కానీ ఒక సమురాయ్ గురువు, తనతో పాటు వంద మంది సమురాయ్ లంటూ తీసుకొని ఒక రహస్య స్థావరం లోకి వెళ్తాడు. అక్కడ బ్లాక్ స్క్వాడ్ సొసైటీ ని నిర్మించి, తనతో పాటు వచ్చిన సమురాయ్ లకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తాడు. అయితే యకూజాలు ఈ బ్లాక్ స్క్వాడ్ సొసైటీ ని కనిపెట్టి, గురువు తో పాటు, 99 మంది సమురాయ్ లను చంపేస్తారు. అక్కడి నుండి తప్పించుకొని వచ్చిన వందవ సమురాయ్ యే ఓజాస్ గంభీర. అతనికి అనుకోకుండా ప్రకాష్ రాజ్ పరిచయం అవ్వడం, ఆయనతో పాటు ముంబై కి వచ్చి పోర్టు నిర్మాణం లో భాగం అవ్వడం, పరిస్థితుల కారణంగా అతను ముంబై కి పెద్ద డాన్ గా మారడం వంటివి మనం ఓజీ లో చూసాము. చూస్తుంటే ఓజాస్ గంభీర్ ప్రభావం పవన్ పై గట్టిగానే పడింది అనుకోవచ్చు.