Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan And Krishna Friendship: అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ విసిరిన ఛాలెంజ్ ని...

Pawan Kalyan And Krishna Friendship: అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ విసిరిన ఛాలెంజ్ ని పట్టించుకోని పవన్ కళ్యాణ్.. వీడియో వైరల్..

Pawan Kalyan And Krishna Friendship: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం తో చిరంజీవి కుటుంబానికి ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో తెలియదు కానీ, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కుటుంబం తో మాత్రం మంచి సాన్నిహిత్యం ఉంది. చాలా మంది ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ మిత్రులు ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తూ ఉంటారు. కానీ మహేష్ బాబు కూడా ఆయనకు మంచి స్నేహితుడే. కానీ […]

Pawan Kalyan And Krishna Friendship: సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం తో చిరంజీవి కుటుంబానికి ఎంత మంచి సాన్నిహిత్యం ఉందో తెలియదు కానీ, పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కుటుంబం తో మాత్రం మంచి సాన్నిహిత్యం ఉంది. చాలా మంది ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ మిత్రులు ఎవరు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ని క్షణం కూడా ఆలోచించకుండా చెప్పేస్తూ ఉంటారు. కానీ మహేష్ బాబు కూడా ఆయనకు మంచి స్నేహితుడే. కానీ బయటకు కనిపించరు అంతే అనేది వాస్తవం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ మధ్య ఎంత స్నేహం ఉందో చెప్పడానికి రీసెంట్ ఉదాహరణ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ఇన్ స్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన వెంటనే తన కుటుంబ సభ్యులతో పాటు , మహేష్ బాబు ని , నమ్రత శిరోద్కర్ ని అనుసరించడమే అని అంటున్నారు నెటిజెన్స్.

Also Read: తెలంగాణలో మరో కొత్త పార్టీ.. ముహూర్తం ఫిక్స్‌ చేసిన కవిత

ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ తో కూడా పవన్ కళ్యాణ్ కి మంచి సాన్నిహిత్యం ఉండేది. కృష్ణ బ్రతికి ఉన్న రోజుల్లో చెట్లు నాటుతూ, అదే ఛాలెంజ్ ని పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇద్దరు హీరోలకు కూడా విసిరాడు. ఆ ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ వరకు చేరలేదేమో తెలియదు కానీ, కృష్ణ విసిరిన ఛాలెంజ్ ని చెయ్యలేదు పవన్ కళ్యాణ్. ఇది అప్పట్లో ఘట్టమనేని ఫ్యాన్స్ కి కాస్త నిరాశ కలిగించింది. కానీ విజయ్ నిర్మల చనిపోయినప్పుడు కానీ, కృష్ణ కొడుకు రమేష్ బాబు, సతీమణి పద్మ చనిపోయినప్పుడు పవన్ కళ్యాణ్ కృష్ణ వద్దకు వెళ్లి పరామర్శించడం వంటివి చేసాడు. సాధారణంగా పవన్ కళ్యాణ్ తన సన్నిహితుల కుటుంబాల్లో ఏదైనా విషాద సంఘటనలు జరిగితే హాజరు అవ్వడం తప్ప, సాధ్యమైనంత వరకు ఇలాంటి కార్యక్రమాలకు దోరంగానే ఉంటాడు. అలాంటిది కృష్ణ కుటుంబం లో ఏ చిన్న కార్యక్రమం జరిగిన పవన్ కళ్యాణ్ హాజరవ్వడం చూస్తుంటే వీళ్ళ మధ్య ఏ స్థాయి సాన్నిహిత్యం ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే అప్పట్లో సూపర్ స్టార్ కృష్ణ పవన్ కళ్యాణ్ కి విసిరినా ఈ ఛాలెంజ్ కి సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper