Pawan Kalyan: ఎన్టీఆర్ వలె డాన్స్ చేయలేకపోవచ్చు కానీ… నా సినిమాలు రికార్డ్స్ బద్దలు కొట్టాలని కోరుకుంటా!

అయితే నేను పూర్తి స్థాయిలో సినిమాల్లో లేను. ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. రాజమౌళి తెలుగు సినిమా స్థాయి ప్రపంచ పటంలో పెట్టారు. దాన్ని ముందుకు కొనసాగించాలి. రేపు ఆయన మహేష్ బాబుతో చేయబోయే సినిమా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను, అన్నారు. ఒక సినిమా ప్రేమికుడిగా పరిశ్రమ అభివృద్ధి కోరుకుంటాను అన్నారు.

Written By: Shiva, Updated On : July 26, 2023 11:45 am

Pawan Kalyan

Follow us on

Pawan Kalyan: బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్, రామ్ చరణ్ పేర్లు ప్రస్తావించారు. నేను ఎన్టీఆర్, రామ్ చరణ్ మాదిరి గొప్పగా డాన్స్ చేయకపోవచ్చు. ప్రభాస్, రానాల వలె సినిమా కోసం కండలు పెంచకపోవచ్చు. ఏళ్ల సమయం కేటాయించకపోవచ్చు. కానీ నా సినిమాలు కూడా ఆడాలి, మిగతా హీరోల రికార్డ్స్ బద్దలు కొట్టాలని భావిస్తాను, అన్నారు. ఈ పోటీ తత్త్వం లేకపోతే మనం రేసులో వెనుకబడిపోతాం. అలాగే క్వాలిటీ తగ్గిపోతుందని అన్నారు.

నాకు హీరోలు అంటే ఇష్టమని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. చిన్నా పెద్దా అనే తేడా లేదు ఏ హీరో అయినా నాకు ఇష్టమే. హీరోలు కష్టపడతారు. వారు ఎవరినీ దోచుకోరు. ఒక హీరో పని చేస్తే సరాసరి 200 కుటుంబాలు బ్రతుకుతాయి. వెయ్యి మందికి పైగా టాక్సులు కడతారు, అన్నారు. అందుకే ఏ హీరో సినిమా ఆడినా నేను సంతోషిస్తాను. ఆర్ ఆర్ ఆర్, బాహుబలి సినిమాలు చూసినప్పుడు మన తెలుగు సినిమా కీర్తి ప్రపంచ స్థాయికి వెళ్లినందుకు గర్వంగా ఫీల్ అవుతాను. ఆర్ ఆర్ ఆర్ వంటి సినిమా మనం కూడా ఒకటి తీస్తే బాగుండు అనిపిస్తుంది.

అయితే నేను పూర్తి స్థాయిలో సినిమాల్లో లేను. ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదేమో. రాజమౌళి తెలుగు సినిమా స్థాయి ప్రపంచ పటంలో పెట్టారు. దాన్ని ముందుకు కొనసాగించాలి. రేపు ఆయన మహేష్ బాబుతో చేయబోయే సినిమా అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నాను, అన్నారు. ఒక సినిమా ప్రేమికుడిగా పరిశ్రమ అభివృద్ధి కోరుకుంటాను అన్నారు.

చిరంజీవి తమ్ముడైనంత మాత్రాన ఏదీ గ్రాంటెడ్ గా తీసుకోలేదు. ఎదుగుదల కోసం స్వయంగా కష్టపడ్డాను. సాయి ధరమ్, వరుణ్, వైష్ణవ్ తేజ్ లకు అదే చెప్పడం జరిగింది. మనం కష్టపడితేనే ఎదుగుదల అని చెప్పాను, అన్నారు. ఇక బ్రో జులై 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. సముద్ర ఖని దర్శకత్వం వహించారు. త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. థమన్ సంగీతం అందించారు. కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్స్ గా నటించారు.