https://oktelugu.com/

Pawan Kalyan- Jr. NTR : పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీయార్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటంటే..?

తెలుగులో ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలకు చాలా మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే చాలా మంది స్టార్ హీరోలు సైతం మంచి కథ దొరికితే మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 14, 2024 / 10:52 AM IST

    Pawan Kalyan- Jr. NTR

    Follow us on

    Pawan Kalyan- Jr. NTR :  తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన చేసిన సినిమాలే ఆయనను చాలా గొప్పగా పరిచయం చేస్తూ ఉంటాయి. మరి ఇలాంటి క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన చాలా సినిమాలు సూపర్ సక్సెస్ ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తూనే ఉన్నాయి. ఇక అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఆయన దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు…ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఒక భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పట్లో ప్రణాళికలైతే రూపొందించుకున్నాడు. నిజానికి ఈ సినిమాలో కనక వీళ్ళిద్దరూ కలిసి నటించినట్లైతే ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయ్యేవని అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి. ఇక త్రివిక్రమ్ చెప్పిన కథకి వీళ్ళిద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆ సినిమా కార్యరూపం అయితే దాల్చలేదు.

    మరి దానికి కారణం ఏంటి అనేది ఎవరు చెప్పనప్పటికీ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తో కలిసి ‘త్రిబుల్ ఆర్’ సినిమా చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తో మిస్ అయిన కూడా మెగా ఫ్యామిలీ హీరో అయినా రామ్ చరణ్ తో జూనియర్ ఎన్టీఆర్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఇటు మెగా అభిమానుల్లో అటు నందమూరి అభిమానుల్లో కూడా ఆనందాన్ని నింపిందనే చెప్పాలి.

    నిజానికి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో కనక ఒక మంచి సినిమా పడి ఉంటే మాత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా ఎదిగేవాడు కానీ కొంచెం లో ఆ సినిమా మిస్ అయింది. ఇక మొత్తానికైతే తనకంటూ ఒక భారీ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్న ఈ ఇద్దరు హీరోలు ఇండస్ట్రీలో చాలా మంచి సక్సెస్ లను అందుకుంటూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాత్రం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తూనే సినిమాలు కూడా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

    ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో ఫ్యూచర్ లో సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ఇప్పుడు మెగా ఫ్యామిలీ నందమూరి, ఫ్యామిలీ మధ్య మంచి అనుబంధమైతే ఉంది. ఈ రెండు ఫ్యామిలీలు కూడా సినిమా ఇండస్ట్రీకి రెండు పిల్లర్స్ లాంటివారనే చెప్పుకోవాలి. రీసెంట్ గా చిరంజీవి కూడా బాలయ్య బాబు 50 ఇయర్స్ ఇండస్ట్రీ ఫంక్షన్ లో బాలయ్య ను ఉద్దేశించి చాలా గొప్పగా మాట్లాడటం అతని వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూనే బాలయ్య బాబుకి చిరంజీవికి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ను కూడా చాలా స్ట్రాంగ్ గా ఎలివేట్ చేసిందనే చెప్పాలి…