
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఎలా ఉండబోతోందంటూ పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఈ సినిమా పై ఒక అప్ డేట్ తెలిసింది. పవన్ కోసం వకీల్ సాబ్ లో యాక్షన్ తో సాగే ఫ్లాష్ బ్యాక్ ను యాడ్ చేసారు. అలాగే కమర్షియల్ హీరోయిన్ ను పెట్టారు, రొమాన్స్ ను ఇరికించారు, అదేవిధంగా పవన్ ను యంగ్ లుక్ లోకి మార్చారు. ఇన్ని చేసినా వకీల్ సాబ్ లో ఇంకా ఆ జోష్ రాలేదట.
Also Read: పుష్ప కోసం తోడేలుగా బన్నీ.. వచ్చే వారం నుండే !
అందుకే తాజాగా ఈ సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ పెడితే, ఎలా ఉంటుంది అన్నట్లు దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నారు. మరీ ఈ ఐటమ్ సాంగ్ లో ఎవరు నటిస్తారో చూడాలి, స్టార్ హీరోయిన్ నే తీసుకోవాలని చూస్తున్నారట. ప్రస్తుతానికి అయితే తమన్నాని అనుకుంటున్నారట. మొత్తానికి సినిమాలో మంచి యాక్షన్ కూడా ఉండబోతుందట. ఏది ఏమైనా వకీల్ సాబ్ మేకర్స్ మాత్రం పవన్ ఫ్యాన్స్ కి ఎలాంటి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడో చూడాలి. అన్నట్టు ఈ ఏడాది ట్విట్టర్ లో ట్రెండ్ అయిన ట్యాగ్స్ లలో ‘వకీల్ సాబ్’ కూడా నిలిచింది.
Also Read: వర్షిణి కోసం ‘శేఖర్ మాస్టర్ – హైపర్ ఆది’ మధ్య ఫైట్ !
అయితే ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా నటించిన ‘పింక్’ మూవీకి రీమేక్ ఇది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్త నిర్మాణంలో రాబోతుంది. కరోనా నేపథ్యంలో షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ కూడా ఆలస్యమైంది. దీంతో వేసవి వినోదంగా వకీల్ సాబ్ రాబోతుంది. వేణుశ్రీరాం దర్శకత్వంలో ‘వకీల్ సాబ్’ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసి ప్రస్తుతం రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఓ వైపు థియేట్రికల్ రైట్స్ భారీ రేంజ్ లో బిజినెస్ జరుగుతుండగా.. ఇటీవలే శాటిలైట్ రైట్స్ కూడా క్లోజ్ అయ్యాయని అంటున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అప్పుడే 100కోట్లు దాటినట్లు తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్