Bigg Boss 10 Telugu: ‘అగ్ని పరీక్ష 2’ నుండి వైల్డ్ కార్డు గా మంచి ఫైర్ మీద వచ్చిన అపూర్వ రేపటి ఎపిసోడ్ ఆరంభం లోనే ఎలిమినేట్ కానుంది. ఇప్పటికే శనివారం కి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయ్యింది. వరుసగా 5 ప్రోమోలు విడుదల చేశారు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ముందుగానే చెప్పారు. డబుల్ ఎలిమినేషన్ వీక్ లో శనివారం రోజున ఒకరిని , ఆదివారం రోజున మరొకరిని ఎలిమినేట్ చేసేవారు. అయితే ఈ శనివారం ఎపిసోడ్ లో ఎలాంటి ఎలిమినేషన్ జరగలేదట. ఆదివారం, అనగా నేడు ఉదయమే అపూర్వ ని ఎలిమినేట్ చేశారట.
హౌస్ లోకి అడుగుపెట్టినప్పటి నుండి హైపర్ యాక్టీవ్ గా ఉంటూ వచ్చిన అపూర్వ, ప్రతీ టాస్క్ లోనూ తన వైపు నుండి బెస్ట్ ఇచ్చింది. కానీ ఊరికే అరవడం, ఇద్దరు కంటెస్టెంట్స్ మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో దూరి చిరాకు పుట్టించడం వంటివి చూసే ఆడియన్స్ కి కూడా కోపం రప్పించేలా చేసింది. వాస్తవానికి షాలిని ఎలిమినేట్ అవ్వాలని రోహిత్ ఫ్యాన్స్ గట్టిగా కోరుకున్నారు. ఎందుకంటే ఆమె కారణంగా రోహిత్ గేమ్ మొత్తం పోతుందని. కానీ అనూహ్యంగా అపూర్వ ఎలిమినేట్ అవ్వడం తో రోహిత్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు. మరి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అన్నారు, మరి షాలిని కూడా ఎలిమినేట్ అవుతుందో లేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏమిటంటే , ఈ వారం మూడు ఎలిమినేషన్స్ ఉంటాయని , ఒకటి ఆడియన్స్ ఓటింగ్ ద్వారా కాగా , మరొకరిని వైల్డ్ కార్డ్స్ వోటింగ్ ద్వారా ఎలిమినేట్ చేస్తారని టాక్. ఇకపోతే ఈరోజు విడుదలైన ప్రోమోలో హౌస్ మేట్స్ ఎక్కువ శాతం మంది రోహిత్ బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు అర్హుడు కాదు అని ఓటు వేశారు.
వాళ్ళ నుండి ఎక్కువ ఓట్లు రావడం వల్ల , రోహిత్ ని ఎలిమినేట్ చేసినట్టుగా నటించి సీక్రెట్ రూమ్ లోకి పంపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు . ఇప్పటికే ఒక సీక్రెట్ రూమ్ ని కూడా రెడీ చేశారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది. ఇకపోతే అపూర్వ బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాలు ఉంది . ఈ రెండు వారాలకు గానూ ఆమెకు దాదాపుగా 2 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ఇచ్చినట్టు తెలుస్తోంది.