Rajinikanth last film : తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తమ కంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి రజినీకాంత్ కి ఉన్న గుర్తింపు నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి మంచి పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చాయి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది స్టార్ హీరోల్లో తను కూడా ఒకరు కావడం విశేషం…ఇక సూపర్ స్టార్ గా తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న ఆయన ఈ జనరేషన్లో ఉన్న ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ వాళ్ళందర్నీ తన అభిమానులుగా మార్చుకుంటున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాడు. ప్రస్తుతం లోకేష్ కనకరాజు (Lokesh Kanakaraju) డైరెక్షన్ లో కూలీ (Cooli) సినిమా చేశాడు. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాతో పాటుగా నెల్సన్ (Nelson) డైరెక్షన్ లో ‘జైలర్ 2’ (Jailer 2) సినిమాని కూడా చేస్తున్నాడు. అయితే రజనీకాంత్ కి ఏజ్ పెరిగిపోతూ ఉండటం వల్ల ఆయన చివరి సినిమా ఏది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు అయితే చేస్తున్నారు. అయితే జైలర్ 2 సినిమా తర్వాత కూడా ఆయన ఒకటి రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. ఆ రెండు మూడు సినిమాలను పూర్తి చేసిన తర్వాత ఆయన సినిమా ఇండస్ట్రీ నుంచి దూరం అయి కొంత రెస్టు తీసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి రజినీకాంత్ చివరి సినిమా ఏది అవుతోంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. ఇక పౌరాణికానికి సంబంధించిన కొన్ని క్యారెక్టర్ లను చేయాలని రజినీకాంత్ కి చాలా రోజుల నుంచి ఒక డ్రీమ్ అయితే ఉందట.
Also Read: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్ కాంబోలో మిస్ అయిన సినిమా ఏంటంటే..?
తన చివరి సినిమా పౌరాణికానికి సంబంధించిన కథతో ఉండబోతోంది అనే వార్తలు కూడా వస్తున్నాయి…ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొస్తున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన లాంటి నటుడు మరెవరు లేరు అనేది వాస్తవం…
ఇక తన స్టైల్ తో ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని సైతం శాసించే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇండియాలో ఉన్న స్టార్ డైరెక్టర్లందరు అతనితో సినిమా చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికి ఆ అవకాశం కొందరికి మాత్రమే దక్కుతోంది.
Also Read: హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కథను పొలిటికల్ డ్రామాగా మార్చాడా..?
మరి తమిళ్ డైరెక్టర్లతోనే కాకుండా ఆయన తెలుగు దర్శకులతో సినిమాలు చేయడానికి ఆసక్తి అయితే చూపిస్తున్నాడట. ఇప్పటికే యంగ్ డైరెక్టర్లు సైతం రజనీకాంత్ ను కలిసి అతనికి కథలను వినిపిస్తున్నారు. మరి అందులో ఏ కథకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు అనేది ఇప్పుడు కీలకంగా మారనుంది…