War 2 Trailer Review: ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న భారీ మల్టీస్టారర్ వార్ 2(WAR 2 TRAILER). బాలీవుడ్ సక్సెస్ఫుల్ సిరీస్లలో ఇది ఒకటి. వార్ లో హృతిక్ రోషన్-టైగర్ ష్రాఫ్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. వార్ లో టైగర్ ష్రాఫ్ రోల్ చనిపోతుంది. దాంతో ఎన్టీఆర్(NTR) ఎంట్రీ ఇచ్చాడు. ఎన్టీఆర్ చేస్తున్న ఫస్ట్ బాలీవుడ్ మూవీ వార్ 2. ఆ మధ్య విడుదలైన టీజర్ కి మిశ్రమ స్పందన దక్కింది. పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనే వాదన వినిపించింది. ట్రైలర్ మాత్రం ఓ రేంజ్ లో ఉంది. అంచనాలు పీక్స్ కి చేరాయి.
అయిన వాళ్ళను, ఐడెంటిటీని కోల్పోయి అజ్ఞాతంలోకి వెళ్లిన ఏజెంట్ గా హృతిక్ రోషన్ (HRITHIK ROSHAN)కనిపిస్తున్నారు. అతన్ని వేటాడే మొండి ఏజెంట్ గా ఎన్టీఆర్ పాత్ర ఉంది. వీరిద్దరూ రూత్ లెస్ అండ్ డేంజరస్. అపజయాన్ని ఒప్పుకోని ఫైటర్స్. ఇద్దరు యోధులు తలపడితే ఎలా ఉంటుందో సిల్వర్ స్క్రీన్ పై చూసి ఎంజాయ్ చేయబోతున్నారు ప్రేక్షకులు. నువ్వా నేనా అనే రేంజ్ లో హృతిక్-ఎన్టీఆర్ మధ్య పోరాట సన్నివేశాలు ఉంటాయని తెలుస్తుంది. రోడ్ , వాటర్, ఎయిర్ లో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ హాలీవుడ్ చిత్రాలను మరిపించాయి. విజువల్స్ మైండ్ బ్లోయింగ్ అనడంలో సందేహం లేదు. ఎన్టీఆర్, హృతిక్ ల లుక్స్ సైతం మెప్పించాయి.
Also Read: ఉదయ్ కిరణ్ తో రొమాన్స్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా? ఇలా మారిపోయిందేంటి?
ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకెళతాయి. కియారా అద్వానీ గ్లామర్ మరొక హైలెట్. ముద్దు సన్నివేశాలతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ లో సైతం ఆమె ఇరగదీశారని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. మొత్తంగా ట్రైలర్ అద్భుతంగా ఉంది. దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన వార్ 2 ఆగస్ట్ 14న థియేటర్స్ లో రానుంది.
దాదాపు రూ. 400 కోట్ల బడ్జెట్ తో వార్ 2 చిత్రాన్ని యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. వార్ 2 ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఓపెనింగ్స్ భారీగా ఉండే సూచనలు కలవు. మరోవైపు హరి హర వీరమల్లు థియేటర్స్ లో వార్ 2 ట్రైలర్ ప్రదర్శించనున్నారని సమాచారం. ఇది వార్ 2కి పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తుంది.
