Annadata Sukhibhava–PM KISAN Scheme: ఏపీలో( Andhra Pradesh) రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ నిధులకు సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చింది. కేంద్రం పిఎం కిసాన్ పథకం విషయంలో ఒక్క నిర్ణయం తీసుకోవడంతో.. దాంతోపాటు అన్నదాత సుఖీభవ నిధులు కూడా జమ కానున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అర్హత కలిగిన రైతులను గుర్తించింది. వారి జాబితాలను ఖరారు చేసింది. అర్హత పొందిన రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 జమ చేయనుంది. అంటే రైతుల ఖాతాలో ఒకేరోజు రూ.7000 జమ కానున్నాయన్నమాట. ప్రస్తుతం ఖరీఫ్ పనులు ప్రారంభం అయిన నేపథ్యంలో సాగు పెట్టుబడులకు ఈ నగదు మొత్తం ఎంతగానో ఉపయోగపడనుంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: ఏపీలో లక్ష కొత్త పింఛన్లు.. ఎవరికి దక్కుతాయంటే?
హామీ ఇచ్చినట్టుగానే..
తాము అధికారంలోకి వస్తే రైతులకు సాగు పెట్టుబడుల కింద ఏడాదికి 20వేల రూపాయల మొత్తాన్ని అందిస్తామని చంద్రబాబు( CM Chandrababu) హామీ ఇచ్చారు. సూపర్ సిక్స్ పథకాల్లో చేర్చారు. అప్పటివరకు ఉన్న రైతు భరోసా పథకాన్ని రద్దుచేసి అన్నదాత సుఖీభవ గా మార్చారు. అయితే కేంద్రం అందించే పీఎం కిసాన్ మూడు విడతల నగదుతో కలిపి అన్నదాత సుఖీభవ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే కేంద్రం పిఎం కిసాన్ నిధుల విషయంలో ఇన్ని రోజులు నిర్ణయం తీసుకోలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన జరిగింది. అయితే ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆగస్టు రెండున ముహూర్తంగా ఖరారు చేసింది. ఆరోజు ప్రధాని మోదీ వారణాసి పర్యటన ఉంటుంది. గతంలో కూడా వారణాసి కేంద్రంగా పిఎం కిసాన్ నిధులు విడుదల చేశారు ప్రధాని మోదీ. ఇప్పుడు కూడా అక్కడ నుంచే ఈ పథకానికి నిధులు విడుదల చేస్తుండడం విశేషం.
మూడు విడతల్లో సాయం..
ఏటా పిఎం కిసాన్( pm Kisan) కింద రూ.6000 మొత్తాన్ని కేంద్రం అందిస్తూ వస్తోంది. మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున అందిస్తోంది. అన్నదాత సుఖీభవ కింద ఏపీ ప్రభుత్వం కూడా ఆ మూడు విడతల్లో కేంద్రంతో కలిపి నిధులను జమ చేయనుంది. కేంద్రం అందించే 6000 రూపాయలకు తోడు 14 వేల రూపాయలను జతచేస్తూ.. 20వేల రూపాయలు అందించనుంది ఏపీ ప్రభుత్వం. అంటే తొలి రెండు విడతల్లో కేంద్ర ప్రభుత్వంతో కలిపి రూ.5000 చొప్పున, చివరి విడత రూ.4000 చొప్పున అందించనుంది ప్రభుత్వం. ఆగస్టు రెండున కేంద్రంతో పాటు అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
Also Read: ఏపీలో ‘పట్టా’లెక్కనున్న మెట్రో!
ఏర్పాట్లు పూర్తి..
వైసిపి( YSR Congress ) ప్రభుత్వ హయాంలో రైతు భరోసా కింద రూ.7500 మాత్రమే అందేది. కేంద్ర ప్రభుత్వం అందించే రూ.6000 మొత్తాన్ని కలిపి రూ.13,500 అందించింది వైసీపీ ప్రభుత్వం. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ వాటాగానే 14 వేల రూపాయలు రైతులకు అందనుంది. ఇప్పటికే రైతుల జాబితాలను సచివాలయాల వారీగా ప్రదర్శించారు. ఈ కేవైసీ ప్రక్రియను సైతం పూర్తి చేశారు. ఇప్పుడు నిధుల విడుదలకు సంబంధించి ముహూర్తం ఖరారు కావడంతో అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.