Pawan Kalyan Serious About Renu Desai: కెరియర్ మొదట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సూపర్ సక్సెస్ లను సాధించాడు.ఆ తర్వాత ఆయన వరుసగా ఒక 10 సంవత్సరాల పాటు డిజాస్టర్ లను మూటగట్టుకున్నాడు. ప్లాపుల్లో ఉన్న కూడా ఆయన క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరోసారి పలు రికార్డులను సైతం బ్రేక్ చేశాడు… ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకుండానే పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు కూడా తనే కావడం విశేషం… అలాంటి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నాడు…ఇక కొద్ది రోజుల్లో ఆయన సినిమా ఇండస్ట్రీకి బై బై చెప్పే అవకాశాలైతే రాబోతున్నాయి.
ఇక ఆయన పూర్తిగా పాలిటిక్స్ లోనే నిమగ్నమయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఇలాంటి ధోరణిలోనే తన అభిమానులు నిరాశ పడకూదనే ఉద్దేశ్యంతో అఖిరా నందన్ ను హీరోగా పరిచయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఈ ప్రయత్నంలో భాగంగా ఆయన ఎంతవరకు సక్సెస్ ను సాధిస్తాడనేది తెలియాల్సి ఉంది.
ఇక తన కొడుకు అయిన అకిరా నందన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడు. కానీ రేణు దేశాయ్ మాత్రం ఇప్పుడప్పుడే అఖిరా ను ఇండస్ట్రీ కి పరిచయం చేయడం దేనికి అంటూ కొంత వరకు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ విషయంలో పవన్ కళ్యాణ్ రేణుదేశాయ్ మీద కొంత వరకు ఫైర్ అయ్యాడట…ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పాపులారిటీ ఉంది.
కాబట్టి అతని క్రేజ్ ను వాడుకొని తన కొడుకుని సైతం హీరోగా ఇండస్ట్రీలో చేయాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు… ఇక పవన్ కళ్యాణ్ తను అనుకున్నట్టుగానే ఆయన కొడుకును ఇప్పుడు ఇండస్ట్రీ కి తీసుకొస్తాడా? లేదంటే రేణు దేశాయ్ మాటకు కట్టుబడి మరికొద్ది సంవత్సరాలు వెయిట్ చేసి అఖిరా నందన్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది…