Bharani Elimination: బిగ్ బాస్ 9(Bigg Boss 9 Telugu) నుండి మరో షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. టాప్ 5 లోకి కచ్చితంగా ఎంట్రీ ఇస్తాడు అనుకున్న భరణి శంకర్ ఎలిమినేట్ అయ్యినట్టు సమాచారం. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ కాసేపటి క్రితమే పూర్తి అయ్యింది. డేంజర్ జోన్ లో భరణి తో పాటు రాము రాథోడ్ వచ్చాడు. వీళ్లిద్దరి మధ్య ఎలిమినేషన్ రౌండ్ జరగ్గా, భరణి ఎలిమినేట్ అయ్యి, రాము సేఫ్ అయ్యాడు. ఇమ్మానుయేల్ వద్ద పవర్ అస్త్ర ఉంది. దానిని ఉపయోగించి భరణి ని సేవ్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఎందుకు ఇమ్మానుయేల్ ఉపయోగించలేదో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. ఒకవేళ ఇమ్మానుయేల్ పవర్ అస్త్ర ని ఉపయోగించడానికి ముందుకు వచ్చినా కూడా, రాము కోసం భరణి దానిని రిజెక్ట్ చేశాడా?, తనూజా, దివ్య లు ఎలాంటి ఎమోషనల్ ఒత్తిడికి గురి అవ్వకుండా, మంచిగా గేమ్ ఆదుకునేందుకు భరణి త్యాగం చేశాడా అనేది తెలియాల్సి ఉంది.
బిగ్ బాస్ హౌస్ లో అతి మంచితనం పనికి రాదు అనడానికి నిదర్శనం భరణి. ఈ సీజన్ లో భరణి రేంజ్ లో ఒక్క కంటెస్టెంట్ కూడా ఆడలేకపోయారు. ఆ వయస్సు లో కూడా ఆయన కుర్రాళ్లకు బలమైన పోటీ ని ఇచ్చి నిలబడ్డాడు. కానీ తనూజ, దివ్య లతో పెట్టుకున్న రిలేషన్ కారణంగా భరణి గేమ్ మొత్తం పాడు అయ్యింది. వాళ్ళతో రిలేషన్ లో ఉన్నప్పటికీ, తన సొంత గేమ్ వచ్చినప్పుడు ఇచ్చిపారేసేవాడు భరణి. కానీ ఆయన పెట్టుకున్న ఎమోషనల్ బంధాలు బాగా హైలైట్ అయ్యాయి కానీ, ఆయన ఆడిన ఆటని ప్రేక్షకులు గుర్తించలేకపోయారు. గత వారం లో వచ్చిన హింట్స్ ని దృష్టిలో పెట్టుకొని, తనూజ, దివ్య లను దూరం పెట్టడానికి భరణి చాలా వరకు ప్రయత్నం చేసాడు. కానీ వాళ్ళు మాత్రం భరణి ని వదలలేకపోయారు.
ఇలా ఎమోషనల్ బాండింగ్ లో నలిగిపోయి, గేమ్ విషయం లో అయ్యోమయానికి గురై, పూర్తిగా భరణి గ్రాఫ్ పడిపోయింది. దానికి తోడు ఈ వారం ఆయన్ని హైలైట్ చేసే టాస్కులు కూడా లేకపోవడం భరణి కి బాగా మైనస్ అయ్యింది. ఓట్లు పడలేదు. ఇక భరణి ఎలిమినేట్ అయ్యాక హౌస్ మొత్తం షాక్ కి గురి అయ్యింది. తనూజ అయితే కుప్పకూలిపోయింది. ఆమెని ఓదార్చడానికి ఎవరి తరం కాలేదు. ఆయన ఎలిమినేషన్ హౌస్ లో అందరి చేత కంటతడి పెట్టించింది. ఎలిమినేట్ ఎప్పుడైనా అవ్వాల్సిందే, కానీ బిగ్ బాస్ హౌస్ చరిత్ర లో తోటి కంటెస్టెంట్స్ నుండి ఈ రేంజ్ ప్రేమని సంపాదించుకున్న ఏకైక కంటెస్టెంట్ గా భరణి మిగిలిపోయాడు. మొదటి మూడు వారాలు తనూజ తో బాండింగ్ లో ఉన్నప్పటికీ, భరణి కి ఎలాంటి ఎఫెక్ట్ పడలేదు. ఎప్పుడైతే దివ్య వచ్చిందో, ఆయన గేమ్ మొత్తం నాశనం అయిపోయింది.